అయ్యో.. ఆ అవ్వకు కొండంత కష్టం.. ఏడాది నుంచి టాయిలెట్‌లోనే నివాసం..

గడ్డితో కప్పి ఉన్న పూరిళ్లు భారీ వర్షానికి నేల మట్టం కావడంతో వృద్ధురాలు మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకుంది. గత ఏడాది నుంచి 4 అడుగుల వెడల్పు 3 అడుగుల పొడవుతో మురికిగా ఉన్న ఒక స్లైస్ టాయిలెట్‌లో నివసిస్తూ తన అవసరాలు తీర్చుకుంటోంది. ఈ విషయంపై పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.  

అయ్యో.. ఆ అవ్వకు కొండంత కష్టం.. ఏడాది నుంచి టాయిలెట్‌లోనే నివాసం..
Woman Living In Toilet

Updated on: Apr 11, 2024 | 1:33 PM

వంద మంది పిల్లలని కూడా తల్లి కష్టనష్టాలకు ఓర్చి పెంచుతుంది. అదే తల్లిని వందమంది పిల్లలు ఆదరించరని అనేక ఘటనలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలు ఎండ, వాన, చలి నుంచి రక్షణ కోసం టాయిలెట్ లో నివసిస్తోంది. గడ్డితో కప్పి ఉన్న పూరిళ్లు భారీ వర్షానికి నేల మట్టం కావడంతో వృద్ధురాలు మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకుంది. గత ఏడాది నుంచి 4 అడుగుల వెడల్పు 3 అడుగుల పొడవుతో మురికిగా ఉన్న ఒక స్లైస్ టాయిలెట్‌లో నివసిస్తూ తన అవసరాలు తీర్చుకుంటోంది. ఈ విషయంపై పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

సుంద్రాడి గ్రామ నివాసి 66 ఏళ్ల మిథిలా మహతోకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వారికి పెళ్లయింది. అప్పటి నుంచి ఆవృద్ధురాలు తన మట్టి ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. అయితే  వర్షంలో ఆ ఇల్లు కూడా నేలమట్టమైంది. తల దాచుకోవడానికి ఇల్లు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో  వృద్ధురాలు పంచాయతీని ఆశ్రయించింది. పంచాయతీ అధికారులు ఒక ప్లాస్టిక్‌ కవర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చివరికి దారిలేక మరుగుదొడ్డిలో తలదాచుకోవడం మొదలు పెట్టింది. రోజంతా అక్కడే గడుపుతోంది. ఇలా దాదాపు 1 సంవత్సరం నుంచి మరుగుదొడ్డిలో వృద్ధురాలు నివసిస్తోంది.

వృద్ధురాలి నిస్సహాయత ఇరుగుపొరుగువారి ఆందోళనను కూడా పెంచింది. ఆ వృద్ధురాలు ఇతరుల ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఎలాగోలా కడుపునింపుకుంటుంది అన్నది ఊరి జనాల మాట. అయితే ఆ వృద్ధురాలి దుస్థితిని వయసుని దృష్టిలో పెట్టుకుని మానవత్వం చూపించమని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. మానవతా దృక్పథంతో పరిస్థితిని పరిశీలించి, వృద్ధురాలికి అండగా నిలబడమని తలదాచుకోవడానికి కనీసం ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దుర్కు గ్రామ పంచాయతీ మిథిలా మహతో ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. అయితే ఓ వృద్ధురాలు తన ప్రాంతంలోని మరుగుదొడ్డిలో నివసిస్తుందని తనకు తెలియదని పంచాయతీ అధినేత చందమోని కరముడి చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వివేక్ రంగా మాట్లాడుతూ పేదలకు అందాల్సిన పథకాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. అంతేకాదు నిరుపేదలకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన హౌసింగ్ స్కీంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని చెప్పారు. అంతేకాదు హోసింగ్ స్క్రీమ్ లో ఇళ్లు పొందిన వారు అధికార పార్టీకి సన్నిహితులే అని వివేక్ రంగా ఆరోపించారు. ప్రధాన్ ఆవాస్ యోజనలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఆ డబ్బుతోనే పార్టీ నేతల భవనాన్ని నిర్మించారని ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..