West Bengal: బెంగాల్ సీఎం మమతకు ‘డు ఆర్ డై’ మూమెంట్.. దేశ రాజకీయాల్లో భవానీపూర్ ఇప్పుడు హాట్ టాపిక్..!

బెంగాల్‌లో మళ్లీ రాజకీయ వేడికి వేలైంది. బీజేపీ, టీఎంసీ మధ్య కీలక పోరుకు తెరలేచింది. ఇది ఇరు పార్టీలకు ఇంపార్టెంట్‌ ఇష్యూగా మారింది. అటు దైశం మొత్తం

West Bengal: బెంగాల్ సీఎం మమతకు 'డు ఆర్ డై' మూమెంట్.. దేశ రాజకీయాల్లో భవానీపూర్ ఇప్పుడు హాట్ టాపిక్..!
Mamata Banerjee
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 05, 2021 | 9:11 AM

Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ రాజకీయ వేడికి వేలైంది. బీజేపీ, టీఎంసీ మధ్య కీలక పోరుకు తెరలేచింది. ఇది ఇరు పార్టీలకు ఇంపార్టెంట్‌ ఇష్యూగా మారింది. అటు దైశం మొత్తం కూడా ఈ పోరుపై ఆసక్తిగా ఉంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం ఇది. మమతా పోటీ చేయనున్న బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మరోమారు బెంగాల్‌లో పోరు రెడీ అవుతున్నాయి బీజేపీ, టీఎంసీ. సెప్టెంబర్ 6న ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

సెప్టెంబరు 30న పోలింగ్‌, అక్టోబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది. బెంగాల్ రాష్ట్ర ప్రత్యేక అభ్యర్థన, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది ఈసీ. బెంగాల్‌లో మ‌మ‌తాబెన‌ర్జి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న భ‌వానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబ‌ర్ 30న ఉప ఎన్నిక నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. భవానీపూర్‌ ఒక్కటే కాకుండా షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాల‌కు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా అదే తేదీన ఉప ఎన్నిక నిర్వహించ‌నున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 294 సీట్లలో 213 స్థానాలను కైవం చేసుకొని టీఎంసీ బెంగాల్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నందీగ్రామ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2వేల ఓట్ల తేడాతో దీదీ ఓడిపోయినా, బెంగాల్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోరుకు సిద్ధమయ్యారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా మిగిలిన నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నటు వెల్లడించింది ఎన్నికల సంఘం.

Read also: Gold smuggling: విజయవాడ పోలీసుల అదుపులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా.. వాయు, జల మార్గాల ద్వారా రవాణా