Durga Puja Funds: దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు గుడ్‌ న్యూస్‌.. నిధులు కేటాయించిన సీఎం

|

Jul 25, 2024 | 8:28 AM

పశ్చిమ బెంగాల్‌లో అతిపెద్ద పండుగైన దుర్గా పూజకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అవుతోంది. అయితే.. పండుగకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇంతకీ.. మమతాబెనర్జీ తీసుకున్న ఆ కాంట్రవర్శీ నిర్ణయమేంటి..?

Durga Puja Funds: దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు గుడ్‌ న్యూస్‌.. నిధులు కేటాయించిన సీఎం
Durga Puja
Follow us on

పశ్చిమ బెంగాల్‌లో అతిపెద్ద పండుగైన దుర్గా పూజకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అవుతోంది. అయితే.. పండుగకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇంతకీ.. మమతాబెనర్జీ తీసుకున్న ఆ కాంట్రవర్శీ నిర్ణయమేంటి..?

పశ్చిమబెంగాల్‌లో దుర్గాదేవి పండుగకు సమయం ఆసన్నమవుతోంది. అతిపెద్ద పండుగైన దుర్గాదేవి నవరాత్రులకు సరిగ్గా 76 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంతో పండుగ ఏర్పాట్లకు సంబంధించి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు మరోసారి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులపై వరాల జల్లు కురిపించారు. బెంగాల్‌లోని 43వేల దుర్గాదేవి పూజా మండపాల నిర్వాహకులకు ఒక్కొక్కరికి 85వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు సీఎం మమత. ఇది గతేడాది ప్రకటించినదానికంటే 15 వేలు ఎక్కువ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది.

వాస్తవానికి.. దుర్గాదేవి మండపాలకు ప్రతి ఏడాది నిధులను పెంచేలా సీఎం మమతా బెనర్జీ 2011లో నిర్ణయం తీసుకున్నారు. 2011లో దుర్గాదేవి పండుగ నిర్వాహకులకు ఇచ్చే ప్రోత్సాహం 25 వేలతో ప్రారంభం కాగా.. తాజాగా.. 85 వేల రూపాయలకు చేరుకుంది. దుర్గాదేవి పూజా మండపాల నిర్వహణకు గతేడాది 70వేల రూపాయలు అందజేశారు. ఇక.. ఈ సంవత్సరం 85వేల రూపాయలు ఇస్తామని, నెక్ట్స్‌ ఇయర్‌ లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు సీఎం మమతా బెనర్జీ. అంతేకాదు.. దుర్గాదేవి మండపాలకు ఇచ్చే విద్యుత్‌ రాయితీని కూడా 75శాతానికి పెంచుతూ బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే.. బెంగాల్‌ ప్రభుత్వ ప్రకటనలపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ.. దుబారా ఖర్చుల కోసం వందల కోట్లు కేటాయిస్తుందని మండిపడుతున్నారు. గతేడాది దుర్గాదేవి పూజా మండపాల కోసం 280కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 365 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా.. విమర్శల సంగతి ఎలా ఉన్నా.. బెంగాల్‌ ప్రభుత్వ నిర్ణయంపై దుర్గాదేవి పూజా మండపాల నిర్వాహకులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..