సీఏఏకి మేమూ వ్యతిరేకం.. బెంగాల్ దీదీ

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ ఆర్ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వివాదాస్పదమైన సీఏఏను వ్యతిరేకిస్తూ.. బెంగాల్ అసెంబ్లీ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో కేరళ, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల తరువాత వెస్ట్ బెంగాల్ దీన్ని వ్యతిరేకించిన నాలుగో రాష్ట్రమైంది.  ఈ చట్టాన్ని నిరసిస్తూ సాగిన ర్యాలీలకు  ముందుండి నడిపించిన మైనారీటీలకే కాక.. హిందూ సోదరులకు కూడా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె అసెంబ్లీలో […]

సీఏఏకి మేమూ వ్యతిరేకం.. బెంగాల్ దీదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2020 | 7:07 PM

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ ఆర్ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వివాదాస్పదమైన సీఏఏను వ్యతిరేకిస్తూ.. బెంగాల్ అసెంబ్లీ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో కేరళ, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల తరువాత వెస్ట్ బెంగాల్ దీన్ని వ్యతిరేకించిన నాలుగో రాష్ట్రమైంది.  ఈ చట్టాన్ని నిరసిస్తూ సాగిన ర్యాలీలకు  ముందుండి నడిపించిన మైనారీటీలకే కాక.. హిందూ సోదరులకు కూడా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘సీఏఏ అంటే ఓ ‘ నిర్వచనాన్ని’ కూడా దీదీ వివరించారు. ఈ చట్టం ప్రకారం..   ఈ దేశ పౌరుడు కావాలంటే ఒకరు ‘ విదేశియుడు’ కావాలి.. ఇది దారుణమైన గేమ్.. మృత్యువుకు ప్రజలను దగ్గర చేయడమే.. దయ చేసి వారి (బీజేపీ)వలలో పడకండి’ అని మమత అన్నారు.

ఈ చట్టాలపై తాము శాంతియుతంగా పోరాడుతామని ఆమె చెప్పారు. బీజేపీని మమత.. పాకిస్తాన్ ‘బ్రాండ్ అంబాసిడర్’ గా అభివర్ణించారు. వారు హిందూస్తాన్ గురించి కన్నా పాకిస్తాన్ గురించి ఎక్కువగా మాట్లాడుతారని ఆమె సెటైర్లు వేశారు. మొదట కేరళ అనంతరం.. కాంగ్రెస్ పాలిత పంజాబ్ ప్రభుత్వం, అనంతరం ఇదే పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ సర్కార్ కూడా సీఏఏని వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించిన సంగతి విదితమే. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే యోచనే లేదని ప్రకటించారు.

అటు-సీఏఏకు తాము కూడా వ్యతిరేకమని తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇటీవల ప్రకటించారు. తమ టీఆర్ఎస్ పార్టీ లౌకికవాద పార్టీ అని ఆయన స్పష్టం చేశారు కూడా.

Latest Articles