West Bengal: బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ధంఖర్

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

West Bengal: బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ధంఖర్
Dhankhar Targets Mamata Banerjee

Updated on: Dec 04, 2021 | 10:59 AM

West Bengal a gas chamber for democracy: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడంలేదన్నారు. రాష్ట్రం ప్రజాస్వామ్యానికి గ్యాస్‌ చాంబర్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. మాట్లాడేందుకు కూడా రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రముఖ చానల్‌తో మాట్లాడారు.

ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్‌లో విపరీతమైన హింస చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి చీఫ్‌గా ఉన్న కోల్‌కతా హైకోర్టు రిటైర్డు జడ్జి ఒకరు రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్‌ ఐసీయూలో ఉందని తనతో అన్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఆ జడ్జి వ్యాఖ్యలే ఉదాహరణ అని ధన్‌కర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగానికి లోబడి నడవడం లేదన్నారు. ఇదీ ప్రస్తుతం బెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అన్నారు. బెంగాల్‌లో రాజ్యాంగాన్ని పాటించడం లేదని ఆయయ మండిపడ్డారు. “నాకు తెలియకుండానే డజనుకు పైగా వైస్ ఛాన్సలర్లను నియమించారు. గవర్నర్ ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీ, అయితే ఇది నాకు తెలియకుండానే జరిగింది” అని ధంఖర్ అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తనను రాష్ట్ర గవర్నర్‌గా పనిచేయడానికి అనుమతించడం లేదని ఆరోపించారు.

రెండేళ్లుగా రాష్ట్ర సమస్యలపై తాను కోరిన సమాచారాన్ని సీఎం మమతా బెనర్జీ అందించలేదని ధంఖర్ అన్నారు. ముఖ్యమంత్రి నుంచి స్పందన కోరే అధికారం గవర్నర్‌కు ఉందని, అయితే బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎలాంటి సమాధానం చెప్పడానికి నిరాకరించారని ఆయన అన్నారు.

Read Also…  Konijeti Rosaiah: బడ్జెట్‌ కూర్పులో ఘనాపాటి.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం..!