Delhi Liquor Case: సీబీఐ దూకుడు.. సీఎం కేజ్రీవాల్‌కు ఆ మరక తప్పదా? తాజా రాజకీయాలపై స్పెషల్ స్టోరీ..

దేశంలో అవినీతి అంతమే తన పంతంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆమ్‌ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఇప్పుడు కేజ్రీవాల్‌కే ఆ అవినీతి మరక తప్పలేదు. లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ రాడార్‌లోకి వెళ్లారు. సీబీఐ విచారణను బీజేపీ కక్షసాధింపు చర్యగా ఢిల్లీ సీఎం ఆరోపించినా.. తన సచ్ఛీలతను కేజ్రీవాల్‌ ఎలా నిరూపించుకుంటారన్నదే ఇప్పుడు ప్రశ్న.

Delhi Liquor Case: సీబీఐ దూకుడు.. సీఎం కేజ్రీవాల్‌కు ఆ మరక తప్పదా? తాజా రాజకీయాలపై స్పెషల్ స్టోరీ..
Weekend Hour

Updated on: Apr 16, 2023 | 7:17 PM

దేశంలో అవినీతి అంతమే తన పంతంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆమ్‌ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఇప్పుడు కేజ్రీవాల్‌కే ఆ అవినీతి మరక తప్పలేదు. లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ రాడార్‌లోకి వెళ్లారు. సీబీఐ విచారణను బీజేపీ కక్షసాధింపు చర్యగా ఢిల్లీ సీఎం ఆరోపించినా.. తన సచ్ఛీలతను కేజ్రీవాల్‌ ఎలా నిరూపించుకుంటారన్నదే ఇప్పుడు ప్రశ్న.

కొద్దిరోజులుగా దేశ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ పిలవగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రియాక్షన్‌ ఇది. విచారణకు వెళ్లే ముందు వీడియో సందేశం రిలీజ్‌ చేయడంతోపాటు.. మీడియాకు తాను చెప్పాలని అనుకున్న నాలుగు ముక్కలు చెప్పేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తీహార్‌ జైలులో ఉన్నారు. పలువురు ఆప్‌ నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు. పలు ఛార్జిషీట్లలో సీఎం కేజ్రీవాల్‌ పేరును ప్రస్తావించాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. చివరకు తాఖీదు రావడంతో కేజ్రీవాల్‌ సీబీఐ ఆఫీసు గడప తొక్కక తప్పలేదు.

ఢిల్లీ మద్యం కేసు కంక్లూజన్‌ ఏమైనప్పటికీ.. అవినీతి మరకలు కేజ్రీవాల్‌కూ అంటుకోవడంతో.. ఈ సమస్య నుంచి ఢిల్లీ సీఎం ఎలా బయట పడతారనేది ప్రశ్న. ఆమ్‌ ఆద్మీ పార్టీ పుట్టుకే.. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చింది. అవినీతి అంతమే లక్ష్యంగా 2011లో అన్నాహజారేతో కలిసి ఉద్యమించారు కేజ్రీవాల్‌. లోక్‌పాల్‌ బిల్లు కోసం పట్టుబట్టారు. 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని పెట్టి 2013 ఎన్నికల్లో గెలిచి కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో 67 చోట్ల గెలిచి చరిత్ర సృష్టించారు కేజ్రీవాల్‌. అదే ఏడాది జన్‌ లోక్‌పాల్‌ బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేశారు. 2020 ఎన్నికల్లోనూ ఆప్‌ ఢిల్లీలో అధికారం నిలబెట్టుకుంది. గత ఏడాది పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చి పొలిటికల్‌ సైలెంట్‌ కిల్లర్‌గా ఆవిర్భవించింది ఆప్‌. గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచినా.. మిగతా రాష్ట్రాల్లో బోణీ కొట్టలేదు. కాకపోతే గణనీయంగా ఓట్లు రాబట్టుకుంది. ఫలితంగా ఆమ్‌ ఆద్మీపార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో కేజ్రీవాల్‌ను సీబీఐ పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

సీబీఐ విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్‌ విడుదల చేసిన వీడియో సందేశం.. మీడియా ముందు వ్యక్తం చేసిన అభిప్రాయా రాజకీయ చర్చకు కారణం అవుతున్నాయి. కేంద్రంలో ఉన్నవాళ్లు అత్యంత శక్తిమంతమైనవాళ్లు అనేది కేజ్రీవాల్‌ కామెంట్‌. తనను జైలులో పెడితే దేశంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని కూడా ఈ ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. సీబీఐ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తానని చెప్పిన ఆయన.. తాను అవినీతి పరుడునైతే ప్రపంచంలో నిష్కలంకులెవరూ ఉండబోరని తనకు తాను ఓ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేసుకున్నారు కేజ్రీవాల్‌

కేజ్రీవాల్‌ టీమ్‌లోని మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ తదితరులు అవినీతి ఆరోపణలతోనే జైలులో ఉన్నారు. సీబీఐ విచారణను బీజేపీ కక్షసాధింపు చర్యగా ఆరోపించిన కేజ్రీవాల్‌. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోగలరా? తన సత్యవ్రతను, సచ్ఛీలతను ఎలా నిరూపించుకుంటారు? ఆప్‌కు జాతీయ పార్టీగా గుర్తింపు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే సీబీఐ విచారణకు పిలవడం వెనుక కేజ్రీవాల్‌ చెబుతున్నట్టు రాజకీయ కుట్ర ఉందా? లిక్కర్‌ స్కామ్‌ డబ్బులే పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారా? విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతారా లేక.. ఊబి నుంచి బయట పడతారా? ఇంతకీ ఆప్‌ అధినేత దారెటు? అనేది ఉత్కంఠగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..