లాక్ డౌన్ అంటే లాక్ డౌనే ! రూలంటే రూలే ! ఈ కోవిడ్ మహమ్మారి టైం లో తప్పనిసరిగా గైడ్ లైన్స్ పాటించాలని కేంద్రం పదేపదే మాటిమాటికీ చెబుతూ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా జనాలకు బేఫికర్ ! యధేచ్చగా వాటిని ఉల్లంఘిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఓ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఆ తరువాత ‘వింత ‘విందు శిక్ష’ అనుభవించక తప్పలేదు. ఈ జల్లాలోని ఉమారి అనే గ్రామంలో జరిగిన వివాహానికి సుమారు 300 మందికి పైగా హాజరయ్యారు. ఇప్పుడు జరిగే ఇలాంటి తంతులకు 50 మందికి మించి హాజరు కారాదన్న రూల్ ఉంది. కానీ దాన్ని తుంగలో తొక్కి పొలోమంటూ పెద్ద సంఖ్యలో వీళ్లంతా అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు ఈ సమాచారం ఎలా తెలిసిందోగానీ బిలబిలమంటూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే చాలామంది పారిపోగా దాదాపు 17 మంది మాత్రం పట్టుబడిపోయారు. వీరిని ఖాకీలు ఓ పొలం పక్కన రోడ్డుపైకి తీసుకుపోయి శిక్షగా వారి చేత కప్ప గంతులు వేయించారు. మధ్యలో సరిగా ‘ పర్ఫామ్ ‘చేయలేకపోయిన ఓ ఉల్లంఘనుడిపైకి సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసాయన లాఠీ ఎత్తాడు. నలుగురైదుగురు పోలీసులు వాచ్ చేస్తుండగా ఈ పనిష్మెంట్ అమలయింది. మళ్ళీ ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంకా తీవ్రంగా శిక్షిస్తామని ఖాకీలు హెచ్చరించి వారిని వదిలేశారు.
బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో అయితే ఇలా లాక్ డౌన్ అతిక్రమించినవారిని ఓ మార్కెట్ మధ్యలో రోడ్డుమీద కొంతదూరం మోచేతుల మీద పాకించారు.
In Bhind “Baaratis” were made to do ‘Frog Jump’ for violating #CovidIndia-19 restrictions. The wedding was being organized, in violation of the lockdown restriction enforced in Bhind @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/QftxjTsFvL
— Anurag Dwary (@Anurag_Dwary) May 20, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )
మధ్యదరా సముద్రంలో ఘోరం….!! పడవ మునిగి 57 మంది మృతి… ( వీడియో )