లక్నోను ఢిల్లీనగరంగా మారుస్తాం..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రైతు సంఘాల హెచ్చరిక

యూపీ రాజధాని లక్నోను ఢిల్లీ నగరంగా మారుస్తామని రైతు సంఘాలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని హెచ్చరించాయి. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఎలా ఆందోళన చేస్తున్నామో అలాగే లక్నో,

లక్నోను ఢిల్లీనగరంగా మారుస్తాం..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రైతు సంఘాల హెచ్చరిక
We Will Turn Lucknow Into Delhi Says Farmer Leaders

Edited By:

Updated on: Jul 27, 2021 | 11:44 AM

యూపీ రాజధాని లక్నోను ఢిల్లీ నగరంగా మారుస్తామని రైతు సంఘాలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని హెచ్చరించాయి. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఎలా ఆందోళన చేస్తున్నామో అలాగే లక్నో, తదితర నగరాల్లో కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తిఖాయత్ ప్రకటించారు. సెప్టెంబరు 5 వ తేదీ తరువాత లక్నోకు దారి తీసే అన్ని రోడ్లనూ అన్నదాతలు దిగ్బంధం చేస్తారని, ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తారని ఆయన చెప్పారు. మీ రాజధాని ఢిల్లీగా మారడం తథ్యం అన్నారు. వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో…తమ ఆందోళనను అన్ని మూలలకూ విస్తరిస్తామని అయన చెప్పారు. ‘మిషన్ యూపీ అండ్ ఉత్తరాఖండ్’ అన్నదే తమ నినాదమని తిఖాయత్ వివరించారు. సెప్టెంబరు 5 న పశ్చిమ యూపీలోని ముజఫర్ నగర్ లో కిసాన్ మహాపంచాయత్ ను నిర్వహిస్తామని.. లక్షలాది రైతులు దీనికి హాజరవుతారని మరో నేత యోగేంద్ర యాదవ్ వెల్లడించారు.

మిషన్ యూపీ, ఉత్తరాఖండ్ ఆందోళనలో భాగంగా భారీ ర్యాలీలు, మహా పంచాయత్ తో బాటు పలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని లక్నో లో ఢిల్లీ తరహా ఆందోళనలు పుంజుకుంటాయని ఆయన చెప్పారు. బీజేపీ, ఆ పార్టీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని దశల్లోనూ ఉద్యమిస్తాం.. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయులవరకు కూడా ఇది సాగుతుంది అని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇన్ని నెలలుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వద్ద తమ ప్రొటెస్ట్ కొనసాగుతుందని ఆయన చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి : వధువుకి గులాబ్‌ జామ్‌ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువులు ఎం చేసిందో చుడండి..వైరల్ వీడియో:Viral Video.

 రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.

 ట్రైన్‌ కింద ప్రయాణికుడు…సూపర్‌ మ్యాన్‌ పోలీస్‌ రెస్క్యూ !వైరల్ అవుతున్న వీడియో..:Passenger Viral Video.

 భర్త చేసిన పాడు పనికి హీరోయిన్ రాజీనామా..ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..:Shilpa Shetty video.