అస్సాంతో సరిహద్దు వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటాం.. మిజోరం సీఎం జొరాంతాంగా

అస్సాంతో గల సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకుంటామని మిజోరం ముఖ్యమంత్రి జొరాంతాంగా ప్రకటించారు.

అస్సాంతో సరిహద్దు వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటాం.. మిజోరం సీఎం జొరాంతాంగా
Mizoram Cm

Edited By: Phani CH

Updated on: Aug 01, 2021 | 12:34 PM

అస్సాంతో గల సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకుంటామని మిజోరం ముఖ్యమంత్రి జొరాంతాంగా ప్రకటించారు. అస్సాం-మిజోరాం మధ్య ఇటీవల పెద్దఎత్తున ఉద్రిక్తతలు రేగాయి. మిజోరం పోలీసుల కాల్పుల్లో ఏడుగురు అస్సాం పోలీసులు మరణించారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన 80 మందికి పైగా గాయపడ్డారు. హోమ్ మంత్రి అమిత్ షా నుంచి అందిన ఫోన్ కాల్ తో మిజోరాం సీఎం మెత్తబడినట్టు కనిపిస్తోంది. అస్సాం సర్కార్ తో సానుకూల చర్చలు జరిపి సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. పైగా పరిస్థితిని రెచ్చగొట్టవద్దని, సోషల్ మీడియా ద్వారా కూడా ఏ విధమైన ప్రకటనలు లేదా కామెంట్లు గానీ చేయరాదని తమ రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ పైనా, ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులపైనా మిజోరం పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తమ ముఖ్యమంత్రి తాజాగా చేసిన ప్రకటనతో వారు ఈ కేసును ఉపసంహరించుకోవచ్చునని భావిస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని ఈ రాష్ట్ర సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తనపై పెట్టిన కేసుల విచారణకు ఏ కమిటీనైనా నియమించుకోవచ్చునని, సంతోషంగా ఆ కమిటీ విచారణకు సహకరిస్తానని, అయితే అది తటస్థ కమిషన్ అయి ఉండాలని అస్సాం ముఖ్యమంత్రి శర్మ ట్వీట్ చేశారు. ఇలా ఉండగా అన్ని విపక్షాలూ ఆయనకు మద్దతు ప్రకటించాయి. స్పీకర్ బిశ్వజిత్ నేతృత్వాన 19 మంది సభ్యులతో కూడిన అఖిల పక్ష బృందం ఢిల్లీకి వెళ్లి.. మిజొరాంతో గల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని అక్కడి నేతలను కోరనుంది. అస్సాం-మిజోరం సరిహద్దుల్లో ఆరు కంపెనీల కేంద్ర దళాలను ప్రభుత్వం మోహరించింది. మరో రెండింటిని సిద్ధంగా ఉంచింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బెన్ స్టోక్స్ కంటే ముందు.. మానసిక సమస్యలతో విరామం తీసుకున్న క్రికెటర్లెవరో తెలుసా..?

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.