Akhil Giri: పశ్చిమ బెంగాల్‌లో ముదురుతున్న రాజకీయ రగడ.. పరువు నష్టం వేస్తానంటూ అఖిల్ గిరి కుమారుడు..

|

Nov 22, 2022 | 12:28 PM

తృణముల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల గిరి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన..

Akhil Giri: పశ్చిమ బెంగాల్‌లో ముదురుతున్న రాజకీయ రగడ.. పరువు నష్టం వేస్తానంటూ అఖిల్ గిరి కుమారుడు..
Subendhu Adhikari And Supra
Follow us on

తృణముల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల గిరి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తనయుడు సుప్రకాష్ గిరి బీజేపీ నేత సుబేందు అధికారిపై పరువు నష్టం కేసు పెడతానన్నారు . అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై అఖిల్ గిరి వ్యాఖ్యలను సుబేందు తివారీ ఇటీవల విమర్శించడమే కాక ఆయన కుమారుడు అయిన సుప్రకాష్ గిరిపై కూడా పలు విమర్శనాస్త్రాలతో దాడి చేశారు. తనపై సుబేందు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు ఆయనపై పరువునష్టం కేసు పెడతానని సుప్రకాష్ గిరి తెలిపారు.

మంత్రి అఖిల గిరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుబేందు అధికారి గత వారం బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రపతిపై అఖిల గిరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన ఆయన తన కుమారుడు సుప్రకాష్‌పై కూడా పలు ఆరోపణలు చేశారు. అఖిల్ గిరి మాత్రమే కాకుండా ఆయన కుమారుడు సుప్రకాష్ కూడా ‘నాన్ గ్రాడ్యుయేట్’ అని సుబేందు అన్నారు.

సుబేందు విద్యార్హతను ప్రశ్నిస్తున్నారు..

మంత్రి అఖిల్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సుబేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానించారు. అయితే ఆ ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించడంతో సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే సుబేందు అధికారిపై పరువు నష్టం కేసు పెడతానంటూ అఖిల్ కుమారుడు సుప్రకాష్ గిరి అన్నారు. సుప్రకాష్ గిరి మాట్లాడుతూ.. ‘‘సుబేందు నా విద్యార్హతను ప్రశ్నించారు. కానీ వాస్తవానికి అతను ఏ కాలేజీలో.. ఎలా ఉత్తీర్ణత సాధించాడో మనందరికీ తెలుసు. కోల్‌కతాలోని అశుతోష్ కాలేజీ నుంచి నేను పట్టభద్రుడయ్యాను. నా విద్యార్హతపై ఆయన చేసిన విమర్శలకు కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..