Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో ప్రకృతి బీభత్సం..146 మంది మృతి, వందల మందికి గాయాలు..

|

Jul 31, 2024 | 11:58 AM

వాయనాడ్‌లో భారీ వర్షం కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ప్రమాదం తప్పించుకునే అవకాశం కూడా లభించలేదు. దీంతో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు చాలా మంది. ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ల నుంచి భారీ సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం రంగంలోకి దిగాయి.

Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో ప్రకృతి బీభత్సం..146 మంది మృతి, వందల మందికి గాయాలు..
Wayanad Landslides
Follow us on

కేరళపై మళ్ళీ ప్రకృతి కన్నెర్ర జేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వలన మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీనో ఎన్నడూ కనీవిని ఎరగని విలయం కేరళలోని వయనాడును వణికించింది. ఘోర ప్రమాదాలలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకూ 146 మంది దుర్మరణం చెందారు. 128 మంది గాయపడ్డారు. అంతేకాదు మట్టి దిబ్బల్లో వందలాది మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు జోరుగా కురుస్తున్న వర్షాల వలన బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయలేని పరిస్థితి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎంత నష్టం జరిగిందనేది అంతుచిక్కడం లేదు.

వాయనాడ్‌లో భారీ వర్షం కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ప్రమాదం తప్పించుకునే అవకాశం కూడా లభించలేదు. దీంతో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు చాలా మంది. ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ల నుంచి భారీ సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం రంగంలోకి దిగాయి. ప్రతికూల వాతావరణం మధ్య కూడా బాధితుల కోసం వెతుకుతున్నాయి. బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి బహుళ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి

కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నాం.. సిఎం పినరయి విజయన్

జిల్లాలో ఏర్పాటు చేసిన 45 సహాయ శిబిరాలకు 3 వేల మందికి పైగా ప్రజలను తరలించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రాత్రి 2 గంటలకు మొదటి కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ తర్వాత తెల్లవారుజామున 4:10 గంటలకు రెండోసారి కొండచరియలు విరిగిపడ్డాయని విజయన్ తెలిపారు. డ్రోన్‌లు, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ప్రజలను కనుగొనడానికి సహాయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మృతదేహాలను బయటకు తీయడంలో రెస్క్యూ టీం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బాధితులకు సహాయం చేయడానికి సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది. త్రివేండ్రం, బెంగళూరు, ఢిల్లీ నుండి సర్వీస్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా అదనపు దళాలు, యంత్రాలు, డాగ్ స్క్వాడ్‌ల సహా ఇతర అవసరమైన సహాయక సామగ్రిని రప్పిస్తున్నారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడ.. కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లో సైన్యం చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..