Viral Video: చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. రోగిని చితకబాదిన డాక్టర్లు! వీడియో వైరల్

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని.. డాక్టర్లు విచక్షణా రహితంగా దాడిచేసి చావబాదారు. ఈ షాకింగ్‌ ఘటన ఆదివారం (డిసెంబర్ 21) సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజిఎంసి)లో చోటు చేసుకుంది. బెడ్‌పై పడుకుని ఉన్న రోగిపై తెల్ల కోటు ధరించిన ఓ డాక్టర్‌ సెలాన్‌ స్టాండ్‌తో చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం..

Viral Video: చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. రోగిని చితకబాదిన డాక్టర్లు! వీడియో వైరల్
Doctor Assaults Patient At Hospital

Updated on: Dec 22, 2025 | 4:56 PM

సిమ్లా, డిసెంబర్‌ 22: అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని.. డాక్టర్లు విచక్షణా రహితంగా దాడిచేసి చావబాదారు. ఈ షాకింగ్‌ ఘటన ఆదివారం (డిసెంబర్ 21) సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజిఎంసి)లో చోటు చేసుకుంది. బెడ్‌పై పడుకుని ఉన్న రోగిపై తెల్ల కోటు ధరించిన ఓ డాక్టర్‌ సెలాన్‌ స్టాండ్‌తో చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు ఆసుపత్రి ఆవరణ వెలుపల నిరసనలకు దిగారు. డాక్టర్లు రోగిని పిడి గుద్దులతో కొడుతున్న వీడియో ఆసుపత్రిలో ఇతర రోగులు రికార్డ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

సిమ్లా జిల్లాలోని కుప్వి సబ్ డివిజన్‌లోని ఓ గ్రామానికి చెందిన రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజిఎంసి) ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రి లోపల ఓ బెడ్‌పై రోగి పడుకుని ఉండగా.. ఇంతలో ఓ డాక్టర్ అక్కడికి వచ్చాడు. అయితే డాక్టర్ రాగానే రోగితో దురుసుగా మాట్లాడాడని రోగి బంధువులు ఆరోపించారు. గౌరవంగా మాట్లాడమని అడగడంతో ఆ డాక్టర్‌ తనపై దాడి చేయడం ప్రారంభించాడని తెలిపాడు. డాక్టర్ కోపంతో రోగి కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. రోగి కాళ్లతో డాక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడం కూడా వీడియోలో చూడొచ్చు. ఇతర డాక్టర్లు దాడి చేస్తున్న డాక్టర్‌ను అదుపు చేయడానికి బదులు రోగి ప్రతిఘటించకుండా పట్టుకోవడం విశేషం. దీంతో డాక్టర్‌ బాధితుడిపై పడి విచక్షణా రహితంగా కొట్టడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

వైద్యం కోసం వస్తే ఇంత దారుణానికి పాల్పడుతారా? అంటూ రోగి బంధువులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. నిందితుడైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఆస్పత్రిలో వైద్యుల ప్రవర్తన వైద్య వృత్తికే కలంకం తెచ్చేలా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.