కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37 పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ను ఈ దఫా క్రాస్ చేస్తుందా లేదా అనేదే ఉత్కంఠ. ఉదయం నుంచి మందకొడిగానే పోలింగ్ సాగుతుండటంతో పార్టీలు అంచనాల్లో మునిగిపోయాయి.
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చారు. పోలింగ్ సరళిపై మాట్లాడకపోయినా.. ప్రచారంలో ప్రజల మూడ్ పట్టామంటున్నారు నాయకులు. కాంగ్రెస్‌కు 130 కంటే ఎక్కువ సీట్లు వస్తాయనేది ఆ పార్టీ మాజీ సీఎం సిద్ధరామయ్య మాట.
కర్నాటకలో మళ్లీ కింగ్ మేకర్ కావాలని చూస్తున్న జేడీఎస్.. గతం కంటే ఎక్కువ సీట్లే వస్తాయనే లెక్కల్లో ఉంది. 123 సీట్లు వస్తాయని అంచనా వేసినా తమ పార్టీకి ఆర్థిక కష్టాలు వెంటాడాయని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కుమారస్వామి. కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ ప్రచారం చేయకపోవడంపై తనదైన శైలిలో బదులిచ్చారు కుమారస్వామి.
ఇదిలాఉంటే.. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. ఆటో నడుపుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. తన సొంత నియోజకవర్గం కనకపురలో కాసేపు ఆటో నడిపి ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
#WATCH | #KarnatakaElections | Karnataka Congress president and party’s candidate from Kanakpura, DK Shivakumar drives an auto in the constituency. pic.twitter.com/pPxoaEZBdi
— ANI (@ANI) May 10, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..