బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి బెంగళూరులోని జయనగర్‌లోని నంజనగూడులో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. రాయల దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి కూడా పాల్గొన్నారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మఠానికి చేరుకున్న రుషి సునక్ దంపతులు అరగంట సేపు మఠంలో గడిపారు. తీర్థ ప్రసాదాలు తీసుకుని రాయల వారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసం సందర్భంగా రాయల సన్నిధిలో దీపాలు వెలిగించారు.
భారత సంతతికి చెందిన రిషి సునక్ భారతీయ సంప్రదాయాలపై తనకున్న నమ్మకం గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. తరచుగా హిందూ మతంపై తనకున్న విశ్వాసాన్ని గురించి వెల్లడిస్తూనే ఉన్నారు. తాను హిందువునని అందరిలాగే తాను కూడా తన విశ్వాసాలతో స్ఫూర్తిని పొందుతానని చెప్పారు. ‘భగవద్గీత’పై పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందని కూడా చెప్పారు. రిషి సునక్ తన పిల్లలకు కూడా సంప్రదాయాన్ని అందించాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాన్నో.. అదే విధంగా తన కుమార్తెలకు అందించాలనుకుంటున్నానని చెప్పారు.
VIDEO | Former UK PM Rishi Sunak visits Raghavendra Swamy Mutt in Bengaluru, along with wife Akshata Murty, and in-laws Narayana Murthy and Sudha Murty.
(Source: Third Party)
(Full video available on PTI videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/v7m9NPbZbr— Press Trust of India (@PTI_News) November 5, 2024
రిషి సునక్ బెంగళూరు నగరంలో ఉన్నప్పుడు దోసెలు తినడానికి బెంగళూరులోని ప్రముఖ విద్రార్థి భవన్‌ను కూడా సందర్శించారు. రిషి సునక్, క్యాజువల్స్ ధరించి, సౌత్ బెంగుళూరులోని రెస్టారెంట్‌లో భోజనాన్ని ఆస్వాదహిస్తున్న సమయంలో అతను నగరాన్ని సందర్శించిన ఫోటో అంతకు ముందు వైరల్ అయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..