Rahul GandhI: రాహుల్ ఇచ్చిన స్వీట్ గిఫ్ట్‌కు ఉద్వేగానికి లోనైన సీఎం స్టాలిన్

|

Apr 13, 2024 | 11:43 AM

దేశంలో ఎన్నికల వేడి నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల సభలు, ప్రచారాలే కనిపిస్తున్నాయి. దీంతో, నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ కోసం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Rahul GandhI: రాహుల్ ఇచ్చిన స్వీట్ గిఫ్ట్‌కు ఉద్వేగానికి లోనైన సీఎం స్టాలిన్
Rahul Gandhi - CM Stalin
Follow us on

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి నడుస్తోంది. నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో ఇండియా కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కోయంబత్తూరులో కూటమి బహిరంగ సభకు వెళ్లాల్సి ఉండగా.. మార్గమధ్యంలో ఓ స్వీట్ షాపు వద్ద ఆగారు రోహుల్. రోడ్డు డివైడర్ క్రాస్ చేసి ఆ షాపులోకి వెళ్లడంతో.. అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడి స్పెషల్ స్వీట్‌ను టేస్ట్ చేసిన రాహుల్.. షాపు ఓనర్, అక్కడి వర్కర్స్‌తో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో రాహుల్‌ అక్కడ స్పెషల్‌గా లభించే ఒక కిలో మైసూర్‌పాక్‌ కొనుగోలు చేశారు.

అయితే,  కొనుగోలు చేసిన స్వీట్స్‌ ప్యాకెట్‌ ఎవరి కోసం అని అడగ్గా.. మై బ్రదర్ స్టాలిన్ కోసం అని రాహుల్ చెప్పారు . అనంతరం, కూటమి తలపెట్టిన పబ్లిక్ మీటింగ్ వద్దకు వెళ్లిన రాహుల్‌.. ఆ మైసూర్‌పాక్‌ స్వీట్‌ ‍బాక్స్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందించారు. ఈ సందర్బంగా తన కోసం స్వయంగా రాహుల్ స్వీట్స్‌ తేవడంతో స్టాలిన్‌ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఉద్వేగంతో రాహుల్‌ని హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్-స్టాలిన్ మధ్య బాండింగ్ చూసి.. కాంగ్రెస్, డీఎంకే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కల్మషం లేని మనసు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..