Meri Mati Mera Desh Campaign: ఆగస్టు 9 నుంచి 30 వరకు కొనసాగే ‘మేరీ మాటి.. మేరీ దేశ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలుచోట్లు మొక్కలు నాటి ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఐఐటీ భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ‘మేరీ మాటి.. మేరా దేశ్’ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.
Dharmendra Pradhan
Follow us on
Meri Mati Mera Desh Campaign: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులను గౌరవించుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘మేరీ మాటి.. మేరా దేశ్(నా మట్టి.. నా దేశం)’ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 9 నుంచి 30 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలుచోట్లు మొక్కలు నాటి ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఐఐటీ భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ‘మేరీ మాటి.. మేరా దేశ్’ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. 200 ఏళ్ల క్రితం ఐరీష్‌వారిపై జరిగిన ‘పైయిక్ రిబిల్లియన్’లో ప్రాణాలర్పించిన అమర వీరులకు నివాళులు అర్పించారు.
కాగా, ‘మేరీ మాటి.. మేరా దేశ్’ ప్రచారం ద్వారా వీర జవాన్ల జ్ఞాపకార్థంగా దేశమంతటా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహన ఆగస్టు 16 నుంచి ప్రారంభమవనుండగా.. ఆగస్టు 30న న్యూఢిల్లీలోని కద్వాతి పాత్‌లో ప్రముఖుల సమక్షంలో ముగింపు వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేసేలా కేంద్రం https://merimaatimeradesh.gov.in/ వెబ్‌సైట్ ను కూడా ప్రారంభించింది. దీనిలో చేసిన కార్యక్రమాల సెల్ఫీలను అప్‌లోడ్ పౌరులు చేయవచ్చు.