
తమిళనాడులో గోల్డ్ స్మగ్లింగ్ కోసం రకరకాల దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. శ్రీలంక నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 20 కోట్ల బంగారాన్ని చాలా చాకచక్యంగా సీజ్ చేశారు కోస్ట్‌గార్డ్ , డీఆర్‌ఐ సిబ్బంది. జాలర్ల బోటులో బంగారన్ని స్మగ్లింగ్ చేస్తునట్టు కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. గల్ఫ్ ఆఫ్ మున్నార్ ప్రాంతంలో జాలర్ల బోటును వెంబడించారు కోస్ట్‌గార్డ్ సిబ్బంది. కోస్ట్‌గార్డ్‌ను చూసి సముద్రగర్భంలో బంగారాన్ని దాచిపెట్టారు స్మగ్లర్లు.
మెరైన్ డైవర్లు బంగారాన్ని సముద్రగర్భం నుంచి బయటకు తీశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 32.689 కిలోల బంగారం విలువ రూ. 20.2 కోట్లు ఉంటుందని కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
#WATCH | How Indian Coast Guard personnel, along with the DRI officials and Customs, carried out the special operation to seize 32.689 kgs of Gold valued at approx. Rs 20.2 Crores, from two fishing boats at the Gulf of Mannar area off Tamil Nadu.
(Video: Indian Coast Guard) pic.twitter.com/fQOtJIWYbF
— ANI (@ANI) June 1, 2023
ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్‌లో తమిళనాడులోని మండపం సముద్రతీరంలో స్మగ్లర్లు సముద్రంలో విసిరిన సుమారు రూ. 10 కోట్ల విలువైన 17.7 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం