BJP: రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై బీజేపీ సాంగ్.. ‘యే హై నఫ్రాత్‌ కీ దుకాన్’ అంటూ విమర్శనాస్త్రాలతో..

|

Aug 11, 2023 | 5:23 PM

BJP'sNew Song: దాదాపు 2.55 నిమిషాల పాటు సాగే ఈ వీడియో సాంగ్‌లోప్రధాన మంత్రి ప్రసంగంలోని సారాంశాలతో మొదలవుతుంది. ప్రధాని మోదీ భారత సైనిక పటిమను పెంపొందించడం, ఆర్టికల్ 370 రద్దు, వందే భారత్ రైళ్ల ప్రారంభం, అంతరిక్ష సాంకేతికత, ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్త ఆదరణ వంటి అంశాలతో పాటు బీజేపీ ప్రభుత్వ విజయాల గురించి వీడియో ప్రస్తావిస్తుంది. అలాగే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలపై చేసిన విమర్శలు కూడా..

BJP: రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై బీజేపీ సాంగ్.. ‘యే హై నఫ్రాత్‌ కీ దుకాన్’ అంటూ విమర్శనాస్త్రాలతో..
Narendra Modi
Follow us on

లోక్‌సభ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం కాంగ్రస్, రాహుల్‌ గాంధీ, ఇతర నేతలను విమర్శిస్తూ ఒక పాటను విడుదల చేసింది. దాదాపు 2.55 నిమిషాల పాటు సాగే ఈ వీడియో సాంగ్‌లోప్రధాన మంత్రి ప్రసంగంలోని సారాంశాలతో మొదలవుతుంది. ప్రధాని మోదీ భారత సైనిక పటిమను పెంపొందించడం, ఆర్టికల్ 370 రద్దు, వందే భారత్ రైళ్ల ప్రారంభం, అంతరిక్ష సాంకేతికత, ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్త ఆదరణ వంటి అంశాలతో పాటు బీజేపీ ప్రభుత్వ విజయాల గురించి వీడియో ప్రస్తావిస్తుంది. అలాగే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలపై చేసిన విమర్శలు కూడా కనిపిస్తాయి. ఇక శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోను కమలదళ నేతలు షేర్ చేస్తున్నారు.

బీజేపీ నేషనల్ స్పోక్స్‌పర్సన్ గోపాల కృష్ణ అగర్వాల్

రాజ్యసభ ఎంపీ బిప్లాడ్ కుమార్ దేబ్(త్రిపుర బీజేపీ)

గుజరాత్ జామ్నగర్ ఎంపీ పూనమ్‌ బెన్

బీజేవైఎమ్ మధ్య ప్రదేశ్

లోక్‌సభలో ప్రధాని ప్రసంగం

విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రతిస్పందనగా గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కొత్త ‘ఇండియా’ కూటమికి ‘ఘమాండియా’ అనే లేబుల్ చేశారు. కళంకిత కుటుంబ పార్టీల కూటమి అని, తక్కువ కాలంలోనే ఈ కూటమి కూలిపోతుందని పేర్కోన్నారు. దాదాపు 2 గంటల 12 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు మోదీ.

లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన 97వ నిమిషంలో మణిపూర్‌ సమస్య నుంచి ప్రధాని తప్పించుకుంటున్నారని విపక్షాలు వాకౌట్‌ చేశాయి. అయితే విపక్షాలు ఛాంబర్ నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రసంగించారు. హింసతో అల్లాడుతున్న రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చర్యలు కొనసాగుతున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ‘దైవిక వరం’ అని మోదీ అభివర్ణించారు. కాంగ్రెస్ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న వ్యక్తులు తరచుగా అభివృద్ధి, విజయాలను అనుభవించారని, ఇందుకు తన ప్రయాణమే ప్రధాన ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నానని, అదే చివరికి తన స్థితిస్థాపకత, పురోగతికి దోహదపడిందని ప్రధాని మోదీ తెలిపారు.