ISRO Exam Scam: వేరేవారి బదులు పరీక్ష రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్.. ఆ పోస్టుల రాతపరీక్షను రద్దు చేసిన ఇస్రో

|

Aug 22, 2023 | 10:39 AM

‘విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం (ఆగస్టు 22) నిర్వహించిన రాతపరీక్షను సోమవారం రద్దు చేసింది. హర్యాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం నిర్వహించిన రాత పరీక్షలో మోసానికి పాల్పడినట్లు రుజువుకావడంతో పరీక్షను రద్దు చేశారు. ఒకరికి బదులు వేరొకరి పరీక్షలు రాసి మోసగించారనే ఆరోపణలపై హర్యాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వారి గుర్తింపులను తనిఖీ చేయగా మోసం..

ISRO Exam Scam: వేరేవారి బదులు పరీక్ష రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్.. ఆ పోస్టుల రాతపరీక్షను రద్దు చేసిన ఇస్రో
ISRO Exam Scam
Follow us on

తిరువనంతపురం, ఆగస్టు 22: ‘విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం (ఆగస్టు 22) నిర్వహించిన రాతపరీక్షను సోమవారం రద్దు చేసింది. హర్యాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం నిర్వహించిన రాత పరీక్షలో మోసానికి పాల్పడినట్లు రుజువుకావడంతో పరీక్షను రద్దు చేశారు. ఒకరికి బదులు వేరొకరి పరీక్షలు రాసి మోసగించారనే ఆరోపణలపై హర్యాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వారి గుర్తింపులను తనిఖీ చేయగా మోసం బయటపడింది. ఈ ఘటనలో మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పరీక్షను రద్దు చేయవల్సిందిగా వీఎస్‌ఎస్‌సీని పోలీసులు కోరారు. దీంతో తిరువనంతపురంలోని వివిధ పరీక్ష కేంద్రాలలో ఆగస్టు 20న నిర్వహించిన టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-ఎ పోస్టులకు రాత పరీక్షలను రద్దు చేసినట్లు VSSC నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటన విడుదల చేసింది.

ఈ పరీక్షకు సంబంధించిన కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలియపరుస్తామని తెలిపింది. జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షకు ఒక్క కేరళ రాష్ట్రంలోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. మరోవైపు హర్యానా నుంచి 400 మందికిపైగా అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. దీనివెనుక కోచింగ్‌ సెంటర్ల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది. పరీక్షలో అక్రమాలు జరుగుతాయంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్లను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. చొక్కా బటన్‌ కెమెరాలతో ప్రశ్నలను స్కాన్‌ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని, ఆ పరికరాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తామని వివరించారు.

అరెస్టయిన వ్యక్తులు బటన్ కెమెరాల నుంచి ప్రశ్నపత్రం స్కాన్‌ చేసి ఎక్కడికో పంపగా, చెవిలో ఉన్న బ్లూటూత్ పరికరాల ద్వారా ప్రశ్నలకు సమాధానాలు విని పరీక్షలు రాసినట్లు పోలీ దీసీపీ వీ అజిత్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.