Viral Video: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు పరాకాష్ట.. ఒకే స్కూటీపై ఆరుగురు ప్రయాణం..

|

May 24, 2022 | 2:51 PM

దేశ వాణిజ్య రాజధాని ముంబై (Social Media Viral )కు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకే స్కూటర్‌పై మొత్తం 6 మంది ప్రయాణిన్నారు. ఆ స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చున్న తీరు చూస్తే ఎవరైనా షాక్ తినక మానరు.

Viral Video: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు పరాకాష్ట.. ఒకే స్కూటీపై ఆరుగురు ప్రయాణం..
Mumbai News
Follow us on

Viral Video: మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించేవారు గురించి అనేక రకాల కామెంట్స్ వింటూనే ఉన్నాం.. ఇక్కడ చాలామంది ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను అర్ధం చేసుకోవడానికి గానీ, వాటిని పాటించడానికి గానీ సిద్ధంగా లేరనే విషయం చాలా సందర్భాల్లో వెల్లడైంది. ఇక దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబై (Social Media Viral )కు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకే స్కూటర్‌పై మొత్తం 6 మంది ప్రయాణిన్నారు. ఆ స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చున్న తీరు చూస్తే ఎవరైనా షాక్ తినక మానరు.

నిజానికి భారతదేశంలోని మోటార్ సైకిల్ పై ప్రయాణించడానికి కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఈ నియమాలు ప్రకారం.. ద్విచక్ర వాహనం నడిపే డ్రైవర్ అదనంగా మరొక వ్యక్తి మాత్రమే కూర్చోవాలి. మొత్తానికి మోటార్ సైకిల్ పై గరిష్టంగా ఇద్దరు మాత్రమే కూర్చునే అనుమతి ఉంది. అయితే రోజూ మోటార్ బైక్ పై దాదాపు ముగ్గురు వ్యక్తులు కూర్చుని ప్రయాణించడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక కొన్ని అరుదైన సందర్భాల్లో ఏకంగా నలుగురు కూడా ప్రయాణిస్తుంటారు.  కానీ ఒక స్కూటర్‌పై 6 మంది కూడా ప్రయాణించగలరా? అని అంటే.. ఆలోచిస్తారు. అయితే ఈ విషయంపై ఎక్కువగా ఆలోచించే బదులు..  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..ఆ వీడియోలో కొంతమంది వ్యక్తులు ఈ అసాధ్యమైన ఫీట్‌ను సాధ్యం చేశారు.

ఇవి కూడా చదవండి

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని హోండా యాక్టివాపై  ఆరుగురు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  రైడర్ సహా ఐదుగురు వ్యక్తులు రైడింగ్ చేస్తున్న ఈ వీడియో చాలా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో  రెడ్ లైట్ వద్ద ట్రాఫిక్ ఆగి ఉంది. ఈ సందర్భంలో ఒకే స్కూటర్‌పై మొత్తం 6 మంది యువకులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అతడిని ఎవరో వీడియో తీశారు. హోండా యాక్టివాపై వెళ్తున్న 6 మందిలో 5 మంది యాక్టివా సీటుపై ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నాడు. అయితే ఆరోబాలుడు.. మాత్రం.. స్కూటర్ వెనుక కూర్చుకున్న ఐదో వ్యక్తి.. భుజంమీదకు ఎక్కి.. కూర్చున్నాడు. ఆరోవ్యక్తి అటువంటి భయం లేకుండా మరో వ్యక్తి భుజంపై స్వారీ చేయడం వీడియోలో చూడవచ్చు. నల్ల కుర్తా ధరించిన ఒక బాలుడుహోండా యాక్టివాని నడుపుతుండగా.. మిగిలిన ఐదుగురు కూర్చుని కనిపించాడు. అంధేరి వెస్ట్‌లోని స్టార్ బజార్ సమీపంలో కారులో నుండి వీడియో చిత్రీకరించబడింది

వైరల్ అవుతున్న ఈ వీడియోను రమణదీప్ సింగ్ హోరా అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోను ముంబై పోలీస్ లకు కూడా ట్యాగ్ చేశాడు. వెంటనే పోలీసులు స్పందించారు. ఈ బైక్ పై ప్రయాణిస్తున్న ఆరుగురు రైడర్ల చిరునామాను అడిగారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరపాలని ఆదేశాలు కూడా ఇచ్చామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..