Viral Video: మనుషులు స్వార్థంతో ముప్పును కొని తెచ్చుకుంటున్నారు.. ఎందుకో వీడియో చూస్తే తెలిస్తుంది..

|

Oct 08, 2021 | 9:19 PM

చెట్లు, మొక్కలు దేవుడిచ్చిన బహుమతి వాటి నుంచి మానవులు తమకు కావలసినవన్నీ పొందుతారు. ఇది మానవులకు మాత్రమే కాకుండా జంతువులు పక్షులకు కూడా అంతే ముఖ్యం...

Viral Video: మనుషులు స్వార్థంతో ముప్పును కొని తెచ్చుకుంటున్నారు.. ఎందుకో వీడియో చూస్తే తెలిస్తుంది..
Tree
Follow us on

చెట్లు, మొక్కలు దేవుడిచ్చిన బహుమతి వాటి నుంచి మానవులు తమకు కావలసినవన్నీ పొందుతారు. ఇది మానవులకు మాత్రమే కాకుండా జంతువులు పక్షులకు కూడా అంతే ముఖ్యం. వీటి కారణంగా భూమిపై ఆక్సిజన్ ఉంది. వర్షాలు కురుస్తున్నాయి. ఒకప్పుడు మన భూమి అడవులతో ఆకుపచ్చగా ఉండేది కానీ మనుషుల స్వార్థం కారణంగా కొన్ని అడవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తమ స్వార్థం కారణంగా తమ ప్రాణాలను, జంతువులు, పక్షులను ప్రమాదంలో పడేస్తున్నారనే విషయాన్ని మానుషులు ఇప్పటికి అర్థం చేసుకోవట్లేదు. ఓ వ్యక్తిని చెట్టు కొట్టేస్తే దాని నమ్ముకొని ఉన్న ప్రాణాలు బయటకు వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఓ వ్యక్తి జేసీబీ యంత్రంతో చెట్టు పడగొట్టాడు. ఆ చెట్టుపై అనేక పక్షులు గూడ కట్టుకుని ఉన్నాయి. చెట్టును పడగొట్టటంతో పక్షులు గూడును కోల్పోయి ఎగిరిపోయాయి. జేసీబీతో చెట్టును పడగొట్టటం, చెట్టుపై నుంచి పక్షులు ఎగిరిపోవటం వీడియో తీశారు. ఈ వీడియోను అటవీ అధికారి సుధా రామన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. వీడియోతో పాటు ‘ ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు ఎల్లప్పుడూ ఆలోచించండి అని రాసుకొచ్చారు.

మొక్కలు నాటడం కంటే చెట్లను నరకడం నివారించడం వెయ్యి రెట్లు మేలని అన్నారు. ఈ వైరల్ వీడియో చూసి చాలా మంది తమ కోపాన్ని కామెంట్ల రూపంలో రాశారు. ఈ రకమైన వీడియో హృదయాన్ని కదిలించిందని రాసుకొచ్చారు.

Reda Also.. Covid-19 Vaccine: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే