Solar Car: కశ్మీర్‌లో మరో ఎలాన్ మస్క్.. పైసా ఖర్చు లేకుండా సూర్యరశ్మితో నడిచే కారు సృష్టి

బిలాల్ తయారు చేసిన సోలార్ కారు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కాశ్మీర్ లోయలో ఇదే తొలి సోలార్ కారు అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా నడిచే కారును తయారు చేసినందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది

Solar Car: కశ్మీర్‌లో మరో ఎలాన్ మస్క్.. పైసా ఖర్చు లేకుండా సూర్యరశ్మితో నడిచే కారు సృష్టి
Automatic Solar Car

Updated on: Jun 24, 2022 | 4:57 PM

Automatic Solar Car: దేశంలో రోజు రోజుకూ పెరుగుతునన పెట్రోల్ డీజిల్ ధరలు(Petrol Diesel Cost) సామాన్యుడికి భారంగా మారాయి. దీంతో చాలా మంది బైకులు, కార్లను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. కొందరు ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొందామంటే.. ఎక్కడ పేలిపోతాయో అని భయం. ఈ క్రమంలోనే కాశ్మీర్‌కు చెందిన ఓ టీచర్ అద్భుతాన్ని ఆవిష్కరించారు.

కాశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి సౌరశక్తితో నడిచే కారును తయారు చేశారు. శ్రీనగర్‌లోని సనత్ నగర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ పదకొండేళ్లు శ్రమపడి తన కలల కారును సృష్టించారు. ఈ లెక్కల మాస్టారుకి కార్లంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ విధానంపై అధ్యయం చేసి చివరకు సోలార్ కారును తయారు చేశారు. కారు బ్యానెట్, కిటికీలు, వెనక అద్దంపై సోలార్ ప్యానెళ్లను అమర్చారు బిలాల్ అహ్మద్. కారు డిజైన్ కూడా చాలా బాగుంది. డోర్స్ కూడా డిఫెంరెంట్‌గా ఉన్నాయి. అంతేకాదు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. ఈ కారుకు ఎలాంటి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. చార్జింగ్ పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. సూర్యరశ్మి ఉంటే చాలు.. ఎక్కడికైనా.. ఎంత దూరమైనా.. పైసా ఖర్చులేకుండా వెళ్లవచ్చు.

ఇవి కూడా చదవండి

బిలాల్ తయారు చేసిన సోలార్ కారు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కాశ్మీర్ లోయలో ఇదే తొలి సోలార్ కారు అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా నడిచే కారును తయారు చేసినందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన్ను అభినందించారు.

స్టైల్‌ని ఇన్నోవేషన్‌ను మిక్స్ చేసి, ఒక దశాబ్దానికి పైగా ప్రాజెక్ట్‌లో పనిచేసిన అహ్మద్ దీనిని సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే వెర్షన్‌గా మార్చాలనుకుంటున్నారు. ఈ కారు ఆన్‌లైన్‌లో చాలా మంది ఆసక్తిని రేకెత్తించింది, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ ఔత్సాహికులు ఎలోన్ మస్క్ టెస్లా ఆపరేషన్‌ను భారతదేశంలో ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

“మెర్సిడెస్, ఫెరారీ, బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్లు సామాన్యుడికి ఒక కల మాత్రమే. మరికొందరు మాత్రమే అలాంటి కార్లను నడపడం.. దానిలో సంచరించడం కలగా మిగిలిపోతుండగా కొంతమంది మాత్రమే దానిని కొనుగోలు చేయగలరు. ప్రజలకు విలాసవంతమైన అనుభూతిని అందించడానికి తాను ఆలోచించినట్లు.. బిలాల్ అహ్మద్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..