Allahabad University: అలహాబాద్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్ధులపై పోలీసుల కాల్పులు..

|

Dec 20, 2022 | 2:00 PM

యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని అలహాబాద్‌ యూనివర్సిటీ రణరంగంగా మారింది. ఫీజుల పెంపుపై విద్యార్ధులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫీస్‌ తాళాలు తెరిచేందుకు ప్రయత్నించడంతో..

Allahabad University: అలహాబాద్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్ధులపై పోలీసుల కాల్పులు..
Violence In Allahabad Unive
Follow us on

యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని అలహాబాద్‌ యూనివర్సిటీ రణరంగంగా మారింది. ఫీజుల పెంపుపై విద్యార్ధులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫీస్‌ తాళాలు తెరిచేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం కాస్త చిలికిచిలికి గాలివానలా తయారై.. కాల్పులకు దారి తీసింది.

సెక్యూరిటీ గార్డుల కాల్పుల్లో పలువురు విద్యార్థులు గాయపడగా.. విద్యార్థి నేత వివేకానంద్‌ పాఠక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న బ్యాంకు దగ్గరకు విద్యార్థి సంఘం నేత వివేకానంద్‌ పాఠక్‌ చేరుకోగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమయ్యింది. సెక్యూరిటీ గార్డుల తీరుపై మండిపడ్డారు విద్యార్ధులు . విద్యార్ధులు క్యాంపస్‌లో విధ్వంసం సృష్టించారు. 200 మందికిపైగా యూనివర్సిటీ గార్డులు గేట్‌ను మూసివేసి తమపై దాడికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. స్టూడెంట్‌ నేత పాఠక్‌, ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్‌ సహా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు యూనివర్సిటీ క్యాంటిన్‌తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. కార్లు , టూవీలర్లను తగులబెట్టారు.

యూనివర్సిటీలో ఘర్షణలపై సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గొడవలు కారణంగా అలహాబాద్‌ యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.