విజయ్‌కి షాకిచ్చిన పర్సనల్ మేనేజర్.. రాత్రి ఫోన్ స్విచాఫ్.. ఉదయాన్నే..
తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి తమిళ పాలిటిక్స్ దాకా మాంచి ఫామ్ లో ఉన్న వ్యక్తి నటుడు దళపతి విజయ్.. సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న విజయ్ రాజకీయాల వైపు అడుగులు వేసి సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. తమిళ వెంట్రి కలగం (TVK) పేరుతో పార్టీని ఏర్పాటు చేసి త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలతో విజయ్ ముందుకు వెళుతున్నారు.. ఈ సమయంలో అతని వద్ద సుదీర్ఘకాలంగా ఉంటున్న నిర్మాత పర్సనల్ మేనేజర్ స్నేహితుడైన సెల్వ కుమార్ విజయ్ కు షాక్ ఇచ్చారు.

టీవీకేలో కీలక పరిణామం చోటుచేసుకుంది.. టీవీకే అత్యవసర సమావేశం జరగడానికి ముందు రోజు పార్టీ వ్యవస్థాపకుడు నటుడు విజయ్ పక్కనే ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటున్న పర్సనల్ మేనేజర్ కనిపించకుండా పోయారు.. సుదీర్ఘకాలంగా విజయ్‌తోనే ఉండి నిర్మాతగా వ్యవహరించిన సెల్వకుమార్ కోసం.. ఆరా తీస్తే ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఏదో పనిమీద వెళ్లి ఉంటారు ఉదయాన్నే వచ్చేస్తారు కదా అని అందరూ అనుకున్నారు.. ఉదయం టీవికె పార్టీ అత్యవసర సమావేశం మొదలైంది.. పార్టీ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు.. సమావేశం కూడా సీరియస్ గా జరుగుతుంది.. అప్పటివరకు కూడా కుమార్ అక్కడ కనిపించలేదు.. కాసేపటికి బిగ్ బ్రేకింగ్ లాంటి వార్త సమావేశం మందిరానికి చేరింది.. విజయ్ పర్సనల్ మేనేజర్ డీఎంకెలో చేరినట్టు వార్త అది. డీఎంకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ సమక్షంలో సెల్వకుమార్ పార్టీలో చేరిన ఫోటో కూడా బయటకు వచ్చింది.
టీడీకే అధినేత విజయ్ సన్నిహితుడు, మేనేజర్, నిర్మాత సెల్వ కుమార్ డీఎంకే లో చేరిక విషయం తెలిసిన కొందరు పూర్తిగా నమ్మలేదు.. ఆ తర్వాత కొద్ది సేపటికి కన్ఫర్మేషన్ రావడంతో సుదీర్ఘ కాలంగా విజయ్ వెన్నంటే ఉన్న సెల్వ కుమార్.. ఎందుకు విజయ్ ను పార్టీని వదిలి వెళ్లారు అన్నది ఎవరికీ అర్థం కాలేదు.. దీనిపై పలు రకాల చర్చలు మొదలయ్యాయి..
నమ్ముకున్న వారికి గౌరవం లేదు..
అయితే.. సీఎం స్టాలిన్ సమక్షంలో పార్టీలో చేరిన సెల్వ కుమార్ విజయ్‌ని వదలడానికి.. డిఎంకెలో చేరడానికి గల కారణాలను ప్రకటించారు విజయ్ ని నమ్ముకున్న వారికి గౌరవం లేదని, ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉందని.. అభిమాన సంఘం నుంచి పార్టీ వరకు కష్టపడ్డ వారికి కనీస విలువ లేదన్నారు. మమ్మల్ని వ్యతిరేకించిన అన్నా డీఎంకే నేతలందరూ ఇపుడు పార్టీలో చేరి తమను తక్కువగా చూస్తున్నారన్నారు.. అన్నా డీఎంకే పార్టీ నుంచి ఇటీవల ఆ పార్టీలో కీలకంగా ఉంటున్న సెంగోట్టియన్, నాఙిల్ సంపత్ అనే ఇద్దరు కీలక నేతలు విజయ్ పార్టీలో చేరారు.. మరికొందరు కూడా త్వరలోనే అన్నాడీఎంకేని వీడి పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విజయ్ తన పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో డిఎంకెకి ప్రత్యామ్నాయం తన పార్టీయేనని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉండగా తనకు సన్నిహితంగా ఉంటూ.. సుదీర్ఘకాలంగా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్న పర్సనల్ మేనేజర్ సెల్వకుమార్ ఒక్కసారిగా విజయ్ కి దూరమై.. డీఎంకే అధినేత స్టాలిన్ సమక్షంలో పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




