మధ్యప్రదేశ్‌లో ఓ లేడీ పోలీస్ రెచ్చిపోయింది. ఒంటిపై ఖాకీ చొక్కా ఉన్న గర్వంతో ప్రవర్తించింది. ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్న సమయంలో .. అక్కడే ఉన్న మహిళా పోలీసు ప్యాంట్‌పై అనుకోకుండా బురద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్.. తన ప్యాంట్‌ని శుభ్రం చేయమని ఆ వ్యక్తి బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆ అధికారిణి శాంతించలేదు. ఆ వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. వీడియో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు మహిళా ఖాకీ.. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే హెంగార్డు శశికళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివ కుమార్ మండిపడ్డారు. ఆ వీడియో తమదాకా వచ్చిందని, ఫిర్యాదు అందితే శశికళపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలా కొంతమంది చేసే ఓవరాక్షన్ వల్ల డిపార్ట్మెంట్ కు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ప్రభుత్వాలు పదే, పదే చెబుతుంటే.. కొందరు పోలీసులు మాత్రం తమ రూటే సెపరేట్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
వీడియో చూడండి…
मध्य प्रदेश के रीवा में एक महिला पुलिसकर्मी ने सिरमौर चौक के पास पहले युवक से पैंट साफ कराई. फिर उसे जोरदार थप्पड़ जड़ दिया. बाइक हटाते हुए महिला पुलिसकर्मी के पैंट में कीचड़ लग गया था @ndtv @ndtvindia @DGP_MP @drnarottammisra pic.twitter.com/m0hdSJ2mrZ
— Anurag Dwary (@Anurag_Dwary) January 12, 2022
Also Read: Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్