Varanasi: కాశిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం.. ఓ వ్యక్తి అరెస్ట్

|

Oct 03, 2024 | 3:38 PM

వారణాసిలోని స్థానిక హిందూ సంస్థ సనాతన్ రక్షక్ దళ్ వ్యవస్థాపకుడు మాట్లాడతూ తాము సాయిబాబాకి వ్యతిరేకం కాదని.. ఆయన విగ్రహాలకు హిందూ ఆలయాల్లో స్థానం లేదన్నారు. అయితే సాయిబాబు విగ్రహాలను ప్రత్యేక ఆలయాల్లో ప్రతిష్టించి పూజించుకోవాలని సూచించారు. తొలగించిన సాయిబాబా విగ్రహాల స్థానంలో లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టమని వెల్లడించారు.

Varanasi: కాశిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం.. ఓ వ్యక్తి అరెస్ట్
Sai Baba Idols
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని వివిధ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక హిందూ సంస్థ సనాతన్ రక్షక్ దళ్ కార్యకర్తలు కాశీలోని వివిధ ఆలయాల్లో ఉన్న సాయి బాబా విగ్రహాలను తొలగించారు. ఈ సందర్భంగా స్థానిక హిందూ సంస్థ సనాతన రక్షక దళ వ్యవస్థాపకుడు మాట్లాడతూ తాము సాయిబాబాకి వ్యతిరేకం కాదని.. ఆయన విగ్రహాలకు హిందూ ఆలయాల్లో స్థానం లేదన్నారు. అయితే సాయిబాబు విగ్రహాలను ప్రత్యేక ఆలయాల్లో ప్రతిష్టించి పూజించుకోవాలని సూచించారు. తొలగించిన సాయిబాబా విగ్రహాల స్థానంలో లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టమని వెల్లడించారు.

వివిధ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నట్లు గుర్తించిన స్థానిక హిందూ సంస్థ సనాతన్ రక్షక్ దళ్ నాయకుడైన అజయ్ శర్మ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అజయ్ శర్మను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సనాతన్ రక్షక్ దళ బృందం లోహటియాలోని బడా గణేష్ దేవాలయంలో ఉన్న సాయి బాబా విగ్రహంతో సహా పలు దేవాలయాల నుంచి విగ్రహాలను తొలగించింది. మంగళవారం కూడా తమ చర్యలను ప్రారంభించింది. ఆలయాల నుంచి తొలగించిన సాయి విగ్రహాలను ఆలయ ప్రాంగణం వెలుపల విగ్రహాలను ప్రతిష్టించారు. అగస్త్య కుండ, భూతేశ్వరాలయాలు సహా మరో 50 ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాన్ని తొలగిస్తామని శర్మ తెలిపారు.

దీంతో అజయ్ శర్మ సహా సనాతన్ రక్షక్ దళ బృందంపై కేసు నమోదు అయింది. ఈ కేసుపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ ఆలయాల భద్రతపై ఫిర్యాదులతో పలువురు భక్తులు తమను సంప్రదించారని తెలిపారు. ఈ ఘటన అనంతరం వారణాసిలో సాయిబాబా ఆలయాల నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. కాశీ (వారణాసి)లో శివుడిని మాత్రమే పూజిస్తారని ఆ సంస్థ నాయకుడు ప్రకటించారు. తదనంతరం సాయి బాబా భక్తులు వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
షిర్డీకి చెందిన శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయిబాబాను మతపరమైన సరిహద్దులు దాటి ప్రేమ, క్షమ, దాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేసిన సన్యాసిగా అభివర్ణిస్తుంది.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలోని షిర్డీగ్రామం సాయిబాబాతో అనుబంధం కలిగి ఉంది. ఇది ప్రసిద్ధ హిందూ తీర్థయాత్ర స్థలంగా ప్రసిద్దిగంచింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ చిన్న గ్రామీణ పట్టణం, షిర్డీ సాయి బాబా ఆత్మ ఉన్న ప్రదేశంగా పిలిస్తే పలికే దైవంగా చెబుతారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..