వారణాసిలోని ఫరూఖాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా.. అదే ప్రేమను అడ్డు పెట్టుకుని మరో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని అత్యంత కిరాతకంగా చంపించేసింది ఓ యువతి. యువకుడిని ఎంత కిరాకతంగా చంపిందో తెలిసి పోలీసులే వణికిపోయారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 23 ఏళ్ల దేవాన్ష్ యాదవ్.. అదే కాలేజీలో చదువుతున్న యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. చాలా కాలం వరకు ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఇంతలో మూడో వ్యక్తి ఎంటరవడంతో మ్యాటర్ కాస్తా డైవర్ట్ అయ్యింది. అమ్మాయి మరో విద్యార్థి రాహుల వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో అతనితో నిత్యం మాట్లాడేది. ఇది తెలిసిన దేవాన్ష్.. యువతిని హెచ్చరించారు. ‘నువ్వు రాహుల్‌తో మాట్లాడటం నాకు ఇష్టం లేదు’ అంటూ అమ్మాయికి స్పష్టం చేశాడు దేవాన్ష్. అయినప్పటికీ పట్టించుకోకుండా యువతి రాహుల్‌తో మాట్లాడుతూనే ఉండేది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఇదే అవకాశంగా మార్చుకున్న యువతి.. దేవాన్ష్‌కు బ్రేకప్ చెప్పేసింది. రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టింది.
ప్రేమలో మోసపోయిన దేవాన్ష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రేయసి తనకు దూరం అవ్వడానికి రాహులే కారణం అని కోపంతో రగిలిపోయాడు. రాహుల్‌తో నిత్యం ఘర్షణకు దిగేవాడు దేవాన్ష్. దాంతో ఇక లాభం లేదనుకున్న యువతి, రాహుల్.. ఇద్దరూ కలిసి దేవాన్షన్‌ను అంతమొందించాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా యువతి మళ్లీ దేవాన్ష్‌కు దగ్గరైనట్లు నటించింది. గత నెల అంటే మే 25న టూర్‌కు వెళ్దామని ప్లాన్ వేసింది. ప్రియురాలు పిలవడంతో సంబరపడిపోయిన దేవాన్ష్.. ముందు వెనుకా ఆలోచించకుండా టూర్‌కు సిద్ధమయ్యాడు. ఇంట్లోవారికి వారణాసికి వెళ్తున్నానంటూ చెప్పి ఫరూఖాబాద్ నుంచి బయలుదేరాడు. వారణాసికి వెళ్లకుండా అక్కడే ఓ హోటల్‌లో బస చేశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు.
మరుసటి రోజు అనుష్క తనతో దేవాన్ష్‌ను కారులో తీసుకెళ్లింది. కారు ప్రయాణ మార్గంలో యువతి, రాహుల్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ని దేవాన్ష్ చేత తాగించారు. అతి తాగిన దేవాన్ష్ స్పృహతప్పి పడిపోయాడు. ఇదే ఛాన్స్ అని భావించిన యువతి.. తన లవర్ రాహుల్, మరొకరి సహాయంతో దేవాన్ష్ ఛాతిపై, మెడపై స్క్రూడ్రైవర్‌తో పలుమార్లు పొడిచి పొడిచి చంపేసింది. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని చందౌలీ జిల్లాలోని సింఘి తాలి వంతెన దగ్గరర పడేసి వెళ్లిపోయారు.
అయితే, ఎన్ని రోజులైనా దేవాన్ష్ రాకపోవడంతో.. అతని తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవాన్ష్ కోసం గాలింపు చేపట్టారు. నెల రోజుల తర్వాత మిస్టరీ వీడింది. దేవాన్ష్ దారుణ హత్యకు గురయ్యాడని గుర్తించారు పోలీసులు. మే 26న మిస్సవ్వగా.. జూన్ 25న ఆదివారం నాడు దేవాన్ష్ మరణించినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో దేవాన్స్ మాజీ ప్రియురాలు, ఆమె ప్రియుడు రాహుల్, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచిన తరువాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..