
‘వందేమాతరం.. సుజలాం సుఫలాం..’ ఈ పదాలు విన్నా, పలికినా ఓ భావోద్వేగం. తెలియకుండానే గుండెలోతుల్లోంచి దేశభక్తి భావం ఉప్పొంగుతుంది. రోమాలు నిక్కబొడిచేంత ఉద్వేగం తన్నుకొస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మరి స్వాంతంత్ర్య సంగ్రామంలో ఇంకెంతటి దేశభక్తిని రగిల్చి ఉంటుంది. స్వతంత్ర సమరయోధులకు ఊపిరిపోసిన గేయం.. వందేమాతరం. దీన్ని గేయంగా చూడలేదు ఆనాడు. దాన్నో నినాదంగా పలికారు. వందేమాతరం అని వినిపిస్తే చాలు బ్రిటిషర్స్ రగిలిపోయేవాళ్లు. అందుకేగా.. బెంగాల్ విభజన కూడా జరిగింది. అలాంటి గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఓ రాజకీయ రగడ జరుగుతోంది. ఎందుకని? వందేమాతరం గీతంలో మిగతా ఆరు చరణాలు ఏమయ్యాయ్? ఇప్పుడెందుకని పాడుకోవడం లేదు? దాని గురించి చెప్పుకునే ముందు.. అసలెందుకొచ్చిందీ ఈ టాపిక్ అనేది చెప్పుకోవాలి. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆ సందర్బంలో వందేమాతరం గీతాన్ని ముక్కలు చేయడం వల్లే కదా ఈ దేశం ముక్కలైందనే మాట వాడారు. మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్… 1937లో వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం నిజం కాదా అని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఆనాడు జిన్నా ఒత్తిడికి తలొగ్గిన జవహర్‌లాల్ నెహ్రూ.. వందేమాతరంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారనేది ప్రధాని మోదీ ప్రధాన ఆరోపణ. ఆ చరణాలే గనక ఉంటే.. ముస్లింలను మరింత రెచ్చగొట్టినట్టవుతుందన్న జిన్నా మాటలు వినే కదా వాటిని...