Vande Bharat Express: పిచ్చికి పరాకాష్ట.. వందే భారత్‌పై రాళ్లు రువ్వుతున్న ఆకతాయిలు.. కిటికీలు ధ్వంసం..

|

Feb 07, 2023 | 9:55 AM

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న వందే భారత్‌ రైళ్లకు నిత్యం చిక్కులు తప్పడం లేదు. అతి వేగంతో అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లకు కొంతమంది శాపంగా మారుతున్నారు.

Vande Bharat Express: పిచ్చికి పరాకాష్ట.. వందే భారత్‌పై రాళ్లు రువ్వుతున్న ఆకతాయిలు.. కిటికీలు ధ్వంసం..
Vande Bharat Express
Follow us on

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న వందే భారత్‌ రైళ్లకు నిత్యం చిక్కులు తప్పడం లేదు. అతి వేగంతో అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లకు కొంతమంది శాపంగా మారుతున్నారు. ఆకర్షణీయంగా కనిపించే ఈ రైలు అద్దాలను అకతాయి నిత్యం ఏదో ఒక చోట రాళ్లతో ధ్వంసం చేస్తున్నారు. తాజాగా.. ఛత్తీస్‌గఢ్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పై రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. నాగ్‌పూర్‌ నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై ఛత్తీస్‌గఢ్‌లోని దధాపరాలో సోమవారం మధ్యాహ్నం రాళ్ల దాడి జరిగింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని దధాపరా నుంచి వందే భారత్ రైలు వెళుతుండగా పలువురు దుండగులు దానిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదు కోచ్‌లలోని కనీసం తొమ్మిది కిటికీలు దెబ్బతిన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్).. దర్యాప్తును ప్రారంభించింది. రైలులో అమర్చిన సీసీ కెమెరాలను ఉపయోగించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా, కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన సంఘటనలు పశ్చిమ బెంగాల్, బీహార్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో రాళ్ల దాడి ఘటనలు జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..