కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి.. వైష్ణోదేవి యాత్రకు బ్రేక్

మంగళవారం జమ్మూ ప్రాంతానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య, జమ్మూ కాశ్మీర్ అంతటా విస్తృతంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. జమ్మూలో 93 మి.మీ, సాంబా 136 మి.మీ, కథువాలో 97.5 మి.మీ, రియాసిలో 84 మి.మీ, భదేర్వాలో 92 మి.మీ వర్షపాతం నమోదైంది.

కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి.. వైష్ణోదేవి యాత్రకు బ్రేక్
Vaishno Devi Landslide

Updated on: Aug 26, 2025 | 6:43 PM

జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. జమ్మూ డివిజన్‌లోని అనేక ప్రాంతాల్లో నిరంతర భారీ వర్షాలు, క్లౌడ్‌ బర్ట్స్‌లు ప్రజల రోజువారీ జీవితాన్ని దెబ్బతీశాయి. నీటి మట్టాలు పెరగడంతో అధికారులు రావి నదిపై ఉన్న రంజిత్ సాగర్ ఆనకట్ట అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. జమ్మూకశ్మీర్‌‌‌లో కుండపోత వర్షం కారణంగా వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కఠువా, కిశ్త్‌వాడ్‌లోనూ ఇటువంటి విపత్తులు సంభవించాయి. జమ్మూ రీజియన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. జమ్మూ డివిజన్‌లోని అనేక ప్రాంతాల్లో నిరంతర భారీ వర్షాలు, క్లౌడ్‌ బర్ట్స్‌లు ప్రజల రోజువారీ జీవితాన్ని దెబ్బతీశాయి. నీటి మట్టాలు పెరగడంతో అధికారులు రావి నదిపై ఉన్న రంజిత్ సాగర్ ఆనకట్ట అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆగస్టు 27 ఉదయం 5:30 గంటల వరకు దోడా, జమ్మూ, కథువా, కిష్త్వార్, సాంబా, ఉధంపూర్ జిల్లాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దీని వలన నివాసితులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో, పౌరులు సహాయం కోసం 112కు డయల్ చేయవచ్చు.

మంగళవారం జమ్మూ ప్రాంతానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య, జమ్మూ కాశ్మీర్ అంతటా విస్తృతంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. జమ్మూలో 93 మి.మీ, సాంబా 136 మి.మీ, కథువాలో 97.5 మి.మీ, రియాసిలో 84 మి.మీ, భదేర్వాలో 92 మి.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..