Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకునేందుకు నిరాకరించారని కరెంట్ కట్ చేసిన అధికారులు.. గ్రామస్తులు ఏమంటున్నారంటే..

|

Jun 04, 2021 | 11:50 PM

Covid 19 Vaccine: కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకోవడానికి నిరాకరించారనే కారణంతో ఓ గ్రామానికి మొత్తం కరెంట్ కట్ చేశారు అధికారులు.

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకునేందుకు నిరాకరించారని కరెంట్ కట్ చేసిన అధికారులు.. గ్రామస్తులు ఏమంటున్నారంటే..
Powercuts
Follow us on

Covid 19 Vaccine: కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకోవడానికి నిరాకరించారనే కారణంతో ఓ గ్రామానికి మొత్తం కరెంట్ కట్ చేశారు అధికారులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నూజ్‌లోని సౌరిఖ్ ప్రాంతంలోకి ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై గ్రామ వాసి సురేష్ దుబే మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ -19 కు టీకాలు వేయడానికి ఎస్డిఎం గ్రామానికి వచ్చారు. టీకా తీసుకున్న వ్యక్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు కానీ, టీకా తీసుకునేందుకు నిరాకరించిన వారు మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. టీకా వేసుకునేందుకు నిరాకరించిన వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయాలని ఎస్డీఎం ఆదేశించారని, ఆ ఆదేశాల మేరకు అధికారులు సంబంధిత ఇళ్లు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు.’’ అని చెప్పుకొచ్చారు.

కాగా, గ్రామస్తులు చేసిన ఆరోపణలను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజికస్ట్రేట్ గజేంద్ర కుమార్ ఖండించారు. బిల్లులు చెల్లించని గృహాలకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లను నిలిపివేశామని చెప్పారు. దీనికి, టీకాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల లబ్ధిదారుల కోసం సదరు గ్రామంలో టీకా శిబిరం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అయితే టీకా శిబిరానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారన్నారు. కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఎస్డీఎం ప్రయత్నించారని గజేంద్ర కుమార్ తెలిపారు.

Also read:

Agriculture: ఖరీఫ్ సీజన్లో ఈ పంటలు పండిస్తే.. మీ పంట పండినట్లే.. ఎకరా సాగుతో లక్షల్లో లాభం..