Operation Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలు.. కొనసాగుతున్న ఆపరేషన్.. కాపాడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుంది..?

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయి ఇప్పటికే 15 రోజులైంది. వారిని కాపాడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది..? నిట్ట నిలువునా డ్రిల్లింగ్‌ చేస్తే ఫలితం ఉంటుందా..? కార్మికుల విముక్తిపై అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు..? ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా ఉన్నప్పటికీ..

Operation Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలు.. కొనసాగుతున్న ఆపరేషన్.. కాపాడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుంది..?
Uttarkashi Tunnel Accident Rescue Operation Live Updates
Follow us
Srikar T

|

Updated on: Nov 27, 2023 | 10:52 AM

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయి ఇప్పటికే 15 రోజులైంది. వారిని కాపాడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది..? నిట్ట నిలువునా డ్రిల్లింగ్‌ చేస్తే ఫలితం ఉంటుందా..? కార్మికుల విముక్తిపై అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు..? ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా ఉన్నప్పటికీ.. వారిని బయటకు తీసుకురావడం అత్యంత సవాలుగా మారింది. తవ్వుతుండగా ఆగర్‌ యంత్రం విరిగిపోవడంతో కార్మికులు బయటకు రావడం మరింత ఆలస్యమైంది. దాంతో కొండ ఎగువ భాగం నుంచి మాన్యువల్‌ డ్రిల్లింగ్‌తో నిట్ట నలువునా కిందకు తవ్వే ప్రక్రియను రెస్క్యూ బృందాలు కంటిన్యూ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. కొండ ఎగువ భాగం నుంచి నిట్ట నిలువునా కిందకు తవ్వే ప్రక్రియ కొనసాగుతోంది. ధ్వంసమైన ఆగర్‌ యంత్రాన్ని బయటకు తీయడం, నిలువునా తవ్వేపనిలో నిమగ్నమయ్యాయి. కొండ ఎగువభాగం నుంచి నిట్టనిలువునా మొత్తం 86 మీటర్ల మేర కిందికి తవ్వాలని నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే 15 మీటర్లు తవ్వడం పూర్తయింది. అంతా సజావుగా సాగితే వంద గంటల్లోనే కూలీల వద్దకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. అటు చుట్టుపక్కల తవ్వే యంత్రాలు కూడా ఈ రాత్రికి సిల్‌క్యారా చేరుకున్నాయి.

సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆరు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాంతరంగా తవ్వుకుంటూ వెళ్లడమే ఉత్తమమైందన్నారు. ఇక ఈ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. దాదాపు 60 మీటర్ల వరకు ప్రత్యామ్నాయ మార్గం ఇప్పటికే 46.9 మీటర్ల పని పూర్తి టన్నెల్‌కు సమాంతరంగా తవ్వకంలో దాదాపు 60 మీటర్ల వరకు ప్రత్యామ్నాయ మార్గం అవసరమవుతుందని నిపుణులు అంచనా వేశారు. ఇందులో 46.9 మీటర్ల పని ఇప్పటికే పూర్తయింది. తవ్వడానికి ఉపయోగించిన ఆగర్‌ యంత్రం తీవ్రంగా మొరాయించింది.

ఇవి కూడా చదవండి

చివరకు మరమ్మతులు చేయలేని స్థాయిలో అది ధ్వంసమైందని నిపుణులు తేల్చారు. ఇక శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్‌ బ్లేడ్లను కత్తిరించేందుకు ప్లాస్మా కట్టర్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటికే వేసిన గొట్టపుమార్గం ద్వారా లోపలకు వెళ్లి కూలీలు తవ్వుకుంటూ రావాల్సి ఉంటుంది. మరోవైపు టన్నెల్‌ చిక్కుకున్న కార్మికులకు లైట్‌ సౌకర్యంతో పాటు ఆహారాన్ని , ఆక్సిజన్‌ను నిరంతరం పంపిస్తున్నారు. పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ నిపుణులు మాత్రం కార్మికుల విముక్తికి మరో నెల రోజులపాటు సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..