Uttarakhand: కొడుకుని దారుణంగా కొట్టిన తల్లి.. దాహం అని అడుగుతున్నా పట్టించుకోని అమ్మ.. వీడియో వైరల్

|

Jul 18, 2024 | 10:59 AM

తన కుమారుడిని అత్యంత పాశవికంగా కొట్టిన తల్లి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన దేవ భూమి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రూర్కీలోని ఝబ్రేదాలో ఓ తల్లి తన బిడ్డను ఓ క్రూరంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి కూడా తన బిడ్డను ఇంత దారుణంగా కొట్టగలదా అని ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. వాస్తవంగా పిల్లలు చేసే తప్పులను పట్టికోకుండా తమ పిల్లలను తల్లి రక్షించుకుంటుంది. ఇలాంటి సంఘటలు తరచుగా కనిపిస్తాయి

Uttarakhand: కొడుకుని దారుణంగా కొట్టిన తల్లి.. దాహం అని అడుగుతున్నా పట్టించుకోని అమ్మ.. వీడియో వైరల్
Viral Video
Follow us on

తన పిల్లలను కాపాడడానికి తల్లి ఎంతకైనా తెగిస్తుంది.. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎవరితోనైనా పోరాడుతుంది. ఇది మనుషులకే కాదు పశు పక్ష్యాదుల్లో కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని సంఘటలు చూస్తే అసలు మాతృప్రేమ అన్న పదానికి అర్ధం వీరికి తెలుసా అనిపిస్తుంది. తాజాగా తన కుమారుడిని అత్యంత పాశవికంగా కొట్టిన తల్లి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన దేవ భూమి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రూర్కీలోని ఝబ్రేదాలో ఓ తల్లి తన బిడ్డను ఓ క్రూరంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి కూడా తన బిడ్డను ఇంత దారుణంగా కొట్టగలదా అని ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. వాస్తవంగా పిల్లలు చేసే తప్పులను పట్టికోకుండా తమ పిల్లలను తల్లి రక్షించుకుంటుంది. ఇలాంటి సంఘటలు తరచుగా కనిపిస్తాయి. అయితే ఈ వీడియోలో తల్లి తన 12 ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టింది. దీంతో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నిజంగా ఆ బిడ్డకు ఈమేనా తల్లీ అని అనుకుంటున్నారు.

ఓ తల్లి తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు వీడియోను షేర్ చేసి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతోఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. వెంటనే ఆ తల్లిని సంప్రదించారు.

ఇవి కూడా చదవండి

అసలు విషయం ఏమిటి?

ఈ రెండు నిమిషాల వైరల్ వీడియోలో ఒక మహిళ తన 12 ఏళ్ల బిడ్డను దారుణంగా కొట్టడం కనిపిస్తుంది. ఆ మహిళ ఆ బాలుడిని దారుణంగా కొట్టడమే కాకుండా చిన్నారి గుండెపై కూర్చొని అతని తలను పట్టుకుని నేల కేసి కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తుంది. తన తల్లి కొట్టిన దెబ్బతో బాధపడిన పిల్లవాడు పదే పదే నీరు అడిగాడు. అయితే ఆ తల్లి పిల్లాడికి నీరు ఇవ్వడానికి బదులుగా మరింత కొట్టడం ప్రారంభించింది.

వీడియోలను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరణ

చిన్నారిని కొడుతున్న సమయంలో తల్లి వీడియో తీసే పనిలో పడింది. వీడియో తీస్తున్నారా లేదా అని మహిళ ఓ వ్యక్తిని అడిగింది. ఈ మహిళ బట్టల దుకాణంలో పని చేస్తుందని తెలుస్తోంది. ఈ వీడియోతోపాటు ఆమె పేరు, చిరునామా కూడా ఇచ్చారు. ఝబ్రేదా పోలీసులు విచారణ కోసం మహిళ వద్దకు చేరుకున్నప్పుడు.. ఆమె కూడా వీడియో చూసి ఆశ్చర్యపోయింది.

ఖర్చులు భరించని భర్త

ఝబ్రేదా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అంకుర్ శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. విచారణ కోసం మహిళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఆ మహిళ ఝబ్రేదాలోని తన పుట్టింటిలోఉందని తెలిసింది. ఆమెకు దేవ్‌బంద్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని తమ విచారణలో తేలిందని చెప్పారు. అయితే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. బాలుడిపై దాడి గురించి పోలీసులు మహిళను అడగగా.. ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఝబ్రేదాలో నివసిస్తున్నట్లు వెల్లడించింది. పిల్లల ఖర్చుల కోసం తన భర్త ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పింది. భర్త నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి పిల్లల ఖర్చుల కోసం తల్లి బిడ్డను కొడుతున్న వీడియోను భర్తకు పంపింది. అయితే తన భార్యను ట్రాప్ చేసేందుకు భర్త ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు.

స్త్రీకి కౌన్సెలింగ్ అవసరం

ఈ చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ పర్యవేక్షణలో ఉంచుతామని. అందుకే పిల్లలను చైల్డ్ వెల్ఫేర్‌కు పంపామని పోలీసులు తెలిపారు. బాలుడిని మహిళ ఈ విధంగా కొట్టడంతో.. మహిళకు కౌన్సెలింగ్ అవసరమని పోలీసులు తెలిపారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసేందుకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..