అయ్యో దేవుడా.. బద్రీనాథ్ వెళ్తుండగా అలకనంద నదిలో పడిపోయిన బస్సు.. 11 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లోని రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. బస్సు ఒక ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయిందని చెబుతున్నారు. బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు..

అయ్యో దేవుడా.. బద్రీనాథ్ వెళ్తుండగా అలకనంద నదిలో పడిపోయిన బస్సు.. 11 మంది గల్లంతు
Alaknanda Accident

Updated on: Jun 26, 2025 | 11:46 AM

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ రుద్రప్రయాగ్‌లోని రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన పార్ఘోల్తీర్ సమీపంలో జరిగింది.. అక్కడ ఒక మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది.. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించాడు. చాలా మంది ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, SDRF, పోలీసులు, పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోలాతిర్ ప్రాంతంలో ఒక బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయిందని పోలీసు ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఐజి నీలేష్ ఆనంద్ భరానే తెలిపారు.

సమాచారం ప్రకారం.. బస్సులో 19 మంది ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. వారిలో ఏడుగురిని రక్షించారు. 11 మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరు మరణించారు.

రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వెళ్తోన్న బస్సు..

రెస్క్యూ టీం కొంతమందిని రక్షించి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేదార్‌నాథ్ నుండి ప్రయాణించిన తర్వాత, ఈ ప్రయాణికులు రాత్రి రుద్రప్రయాగలో ఉండి గురువారం అంటే ఈరోజు ఉదయం బద్రీనాథ్‌కు బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. కానీ గోచార్ సమీపంలో, బస్సు అకస్మాత్తుగా ట్రక్కును ఢీకొట్టడంతో నదిలో పడిపోయింది.

ప్రమాదం గురించి డ్రైవర్ ఏం చెప్పాడంటే..

సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 8 నుండి 9 మంది ఆసుపత్రిలో చేరారు.. వారు చికిత్స పొందుతున్నారు. తాము కేదార్‌నాథ్ నుండి బద్రీనాథ్‌కు వెళ్తున్నామని.. అప్పుడు ఒక ట్రక్కు తమ బస్సును ఢీకొట్టిందని చెప్పాడు.. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఢీకొన్న తర్వాత బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..