ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లొతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజగా చమోలీ జిల్లాలోని గౌచార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్‌హెచ్-7 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తెలెత్తాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో అటుగా వాహనాలు కూడా వెళ్తున్నాయి. అయితే ఈ
ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. కొండచరియలను తొలగించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది.
#Uttarakhand: National Highway 7 blocked near Gauchar in Chamoli district, due to rockfall pic.twitter.com/UGFpl6NTv8
— ANI (@ANI) August 16, 2020
Read More :