Viral: వరదల్లో కొట్టుకుపోయిన ATM.. అందులోని 24 లక్షల నగదు..

|

Aug 11, 2022 | 3:02 PM

ఉత్తరాఖండ్​‌లో భారీ వర్షాలు దుమ్ము రేపుతున్నాయి. దీంతో వరదుల బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరకాశీ జిల్లాలో పరిస్థతి అల్లకల్లోలంగా ఉంది.

Viral: వరదల్లో కొట్టుకుపోయిన ATM.. అందులోని 24 లక్షల నగదు..
Atm Washed Away
Follow us on

Uttarakhand floods: ఉత్తరాఖండ్​లో వరదల బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా(Uttarkashi district) పురోలా ప్రాంతంలో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజాజీవనం అస్తవ్యస్తం అయ్యింది. భారీగా వస్తున్న వరదనీటితో  కుమోలా నది అల్లకల్లోలంగా మారింది. నదికి సమపంలో ఉన్న పురోలా ప్రాంతంలో గల ఎనిమిది దుకాణాలు వదరనీటిలో  కొట్టుకుపోయాయి. అందులోని ఒక షాపులో పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank) ఏటీఎం కూడా ఉంది. ఈ ఏటీఎంలో బుధవారం సాయంత్రమే 24 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కస్టమర్లు విత్ డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో మిగిలిన క్యాష్ అంతా నీటిపాలు అయినట్లే కనిపిస్తుంది. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కుమోల నదికి అకస్మాత్తుగా వరద ఉదృతి పెరగడంతో ఈ షాపులు కొట్టుకుపోయాయి. వాటిలో 2 నగల  దుకాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక నివాస గృహాలు, దుకాణాలకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని నివాసితులంతా భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న తహసీల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు నష్టాన్ని పరిశీలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..