
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని ఒక హోటల్‌లో మంగళవారం (డిసెంబర్ 9) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయి. ప్రస్తుతం అగ్నిమాపక దళం బృందాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. హోటల్ లోపల చాలా మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సాయంత్రం 7:24 గంటలకు, చైనా బాబా ప్రాంతంలోని శిశు మందిర్ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగినట్లు నైనిటాల్ SDM నవాజిష్ ఖాలిక్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయకచర్యలు ప్రారంభించామని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారని SDM నవాజిష్ ఖాలిక్ వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని SDM నవాజిష్ ఖాలిక్ తెలిపారు. మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సకాలంలో రక్షించామన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటన గురించి ఆరా తీశారు. సహాయకచర్యలు ముమ్మరం చేశాలన్నారు. రాత్రిపూట కూడా అగ్నిమాపక దళాలను అక్కడ ఉంచాలని ఆయన ఆదేశించారు.
నైనిటాల్‌లోని మల్లిటాల్ మార్కెట్ ప్రాంతంలోని చైనా బాబా ఆలయం సమీపంలోని ఒక ఇంట్లో మంటలు అంటుకున్నాయి. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో, కొద్దిసేపటికే చెక్క ఇల్లు మొత్తం కాలిబూడిదైంది. మంటలు సమీపంలోని కొన్ని దుకాణాలు, హోటల్లు, ఇళ్లకు మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక దళం, పోలీసు అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్నారు. మంటలను అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
#WATCH | Uttarakhand: Fire broke out in a building in Nainital. Several fire tenders have reached the spot. More details awaited. pic.twitter.com/WGELnhlcrH
— ANI (@ANI) December 9, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..