ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. నిండు ప్రాణం బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. మందు తాగొద్దని చెప్పడమే బాధిత వ్యక్తం చేసిన తప్పు. అలా చెప్పినందుకు ఆగ్రహించిన దుండగులు.. కత్తితో గుండెల్లో పోటు పొడిచాడు. కత్తి వేటు తీవ్రంగా గాయపడిన బాధితుడు.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగ్రాలోని ఎత్మద్ – ఉద్-దౌల పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ సయీద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రవి కుమార్(32) అనే వ్యక్తి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనోజ్ దివాకర్(28) వీధి రౌడి.. మరో నలుగురు స్నేహితులను వెంటపెట్టుకుని కారులో వచ్చాడు. దుకాణదారుల నుంచి వసూళ్లు చేసే దివాకర్.. కూరగాయల వ్యాపారి అయిన రవికుమార్ వద్దకు వచ్చాడు. గుట్కా ఇవ్వాలని అడగగా.. లేదని సమాధానం చెప్పాడు రవి. దాంతో ఆగ్రహానికి గురైన దివాకర్.. ఈ ప్రాంతంలో కూరగాయలు అమ్మలేవని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చాడు.
ఆ తరువాత దివాకర్ తన కారు వద్దకు వెళ్లి రోడ్డుపైనే కూరగాయల కొట్టు ముందు మద్యం సేవిస్తున్నాడు. అది గమనించిన రవి.. అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక్కడ మద్యం తాగొద్దని కోరాడు. తన గిరాకీ పోతదని, మద్యం వేరే చోట తాగాలిన కోరాడు. దాంతో దివాకర్ వెళ్లినట్లే వెళ్లి.. తన స్నేహితులతో కలిసి మళ్లీ వచ్చాడు. రవితో గొడవకు దిగాడు. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవగా.. ఆగ్రహానికి గురైన దివాకర్ తన కారులోని కత్తి తీసుకువచ్చి రవి కుమార్ చాతిలో పొడిచాడు. వెంటనే కుప్పకూలిపోయాడు రవి.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రవి ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇక్కడా వారికి పెద్ద సమస్య తలెత్తింది. చాలా ఆస్పత్రులకు తిప్పినా.. చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఆ తరువాత ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మనోజ్ దివాకర్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..