Maha Kumbh: తొక్కిసలాట జరగలేదు.. మహా కుంభమేళాలో ప్రమాదానికి కారణం ఇదే.. SSP రాజేష్ ద్వివేది

పవిత్ర సంగమం ఘాట్‌ దగ్గర విపరీతమైన రద్దీతో క్యూలైన్‌లో ఒక్కసారిగా తోపులాట జరిగింది. బారికేడ్‌ విరగడంతో పక్కనే నిద్రిస్తున్నవారిపై జనం పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాట, హాహాకారాలతో మహాకుంభమేళాలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. సెక్టార్‌-4లో అర్థరాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు తొక్కిసలాట జరిగింది.

Maha Kumbh: తొక్కిసలాట జరగలేదు.. మహా కుంభమేళాలో ప్రమాదానికి కారణం ఇదే.. SSP రాజేష్ ద్వివేది
Prayagraj Stampede

Updated on: Jan 29, 2025 | 4:16 PM

మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారు. ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే వీటన్నింటి మధ్య కుంభమేళా ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది షాకింగ్ స్టేట్‌మెంట్ వెలుగులోకి వచ్చింది. తొక్కిసలాట జరగలేదని ఆయన చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొందరు భక్తులు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు.

ఎలాంటి తొక్కిసలాట జరగలేదని రాజేష్ ద్వివేది తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొందరు భక్తుల మధ్య తోపులాట జరిగి గాయపడ్డారన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దన్న ఆయన, ఇంకా అనేక ఘాట్‌లను అభివృద్ధి చేశామని, ఆ ఘాట్‌లలో ప్రజలు సులువుగా స్నానాలు చేస్తున్నారన్నారు. ప్రాణనష్టం లేదా గాయపడిన వారి సంఖ్య ప్రస్తుతానికి లేదన్నారు.

వీడియో చూడండి..

అదే సమయంలో మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ.. 10 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానానికి ఒక్కసారిగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. అఘోరాల సాంప్రదాయ ఊరేగింపులకు పోలీసులు, అధికారులు సహాయం అందిస్తుందన్నారని ఆయన అన్నారు. పరిస్థితి అదుపులో ఉందన్న ఆయన, ఈరోజు ఉదయం జరిగిన ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. ఇదిలావుంటే మౌని అమావాస్య సందర్భంగా దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఇలా జరిగింది.

ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బారికేడ్లు దాటే ప్రయత్నంలో కొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. రాజధాని లక్నోలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఇతర సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

భక్తులు తెల్లవారుజాము నుంచే స్నానాలు చేసేందుకు వీలుగా ఇక్కడ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. రాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య అమృత స్నానానికి బారికేడ్లు ఏర్పాటు చేసిన బారికేడ్లపై నుంచి దూకి కొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వీరిలో కొంతమంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం, మౌని అమావాస్యకు ఎనిమిది నుండి 10 కోట్ల మంది భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉంది. అమృత్ స్నాన్ అనేది మహా కుంభమేళాలో అత్యంత పవిత్రమైనది. అతి పెద్ద స్నానోత్సవం, ఇందులో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వస్తారు. అమృత్ స్నాన్ ప్రధాన ఆకర్షణ వివిధ అఘోరాలకు చెందిన సాధువులు స్నానం అచరిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..