AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాన్పూర్‌లో కుప్పకూలిన శిక్షణా విమానం.. ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలు!

కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గంగా బ్యారేజీ సమీపంలో రెండు ఇంజిన్లు కలిగిన శిక్షణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాన్పూర్‌లో కుప్పకూలిన శిక్షణా విమానం.. ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలు!
Kanpur Plane Crash
Balaraju Goud
|

Updated on: Aug 27, 2026 | 12:40 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గంగా బ్యారేజీ సమీపంలోని నత్తాపూర్వా గ్రామం వద్ద రెండు ఇంజిన్లు కలిగిన ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. విమానం అదుపుతప్పి సమీపంలోని పొలంలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గాయపడిన పైలట్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us