“నాన్నా తప్పు చేయలేదు.. నన్ను వదిలేయండి..” పదేళ్ల చిన్నారిని కొట్టి చంపిన తండ్రి..!
ఉత్తరప్రదేశ్‌లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్ కమిషనరేట్ పరిధిలో భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండ్రి తన పదేళ్ల కొడుకును కొట్టి చంపాడు. కొడుకు తన వద్ద నుంచి రూ.500 దొంగిలించాడన్న అనుమానంతో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు తండ్రి.
ఉత్తరప్రదేశ్‌లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్ కమిషనరేట్ పరిధిలో భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండ్రి తన పదేళ్ల కొడుకును కొట్టి చంపాడు. కొడుకు తన వద్ద నుంచి రూ.500 దొంగిలించాడన్న అనుమానంతో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు తండ్రి. చిన్నారిని బెల్టు, కిచెన్ రోలింగ్ పిన్ తో కొట్టి చంపాడు. మోడీనగర్ పట్టణంలోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్యోడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు ఉపయోగించిన రోలింగ్ పిన్‌ను స్వాధీనం చేసుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో చిన్నారి మృతితో కుటుంబసభ్యులంతా రోదనలు మిన్నంటాయి.
నిందితుడు నౌషాద్ తన 10 ఏళ్ల కుమారుడు అహద్ 500 రూపాయలు దొంగిలించాడని అనుమానించాడు. రూ. 500 దొంగిలించాడన్న కోపంతో నిందితుడు తండ్రి నౌషాద్ తన కొడుకు అహద్‌ను బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. అది కూడా అతనికి సంతృప్తికరంగా లేకపోయింది. ఇంట్లోకి వెళ్లి వంటగదిలో ఉన్న రోలింగ్ పిన్ను తీసుకువచ్చి బాలుడి తలపై బలంగా కొట్టాడు. రోలింగ్ పిన్‌తో పదే పదే దాడి చేశాడు. అహద్‌ను అతని తండ్రి 30 నిమిషాల పాటు దారుణంగా కొట్టాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రక్షించమని ఆ బాలుడు తల్లడిల్ఠిపోయాడు. అవి ఏవి పట్టన్నట్లు వ్యవహారించిన నౌషాద్, అహద్‌ను తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు.
కొడుకును దారుణంగా కొట్టిన తర్వాత నిందితుడైన తండ్రి అతడిని అలాగే వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును, తల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అహద్ అతనితో నివసించిన నౌషాద్ మొదటి భార్య కొడుకు అని తెలుస్తోంది. నౌషాద్ మొదటి భార్య అతనిని విడిచిపెట్టింది. ఆ తర్వాత నౌషాద్ రెండో పెళ్లి చేసుకున్నాడు. నౌషాద్‌కి రెండో భార్యకు కూతురు ఉంది. అహద్ విషయంలో రెండో భార్య, నౌషాద్ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే కొడుకుపై దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాగా, ఈ దారుణానికి సంబంధించిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ మోదీనగర్ జ్ఞాన్ ప్రకాశ్‌రాయ్ విచారణ చేపట్టాడు.. మృతుడి మృతదేహాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. బాలుడిని హత్య చేసింది తండ్రి అని పోలీసులు తెలిపారు. హత్య అనంతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. హత్య కేసులో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రూ. 500 కోసం అమాయకుడు అహద్‌ను తండ్రి ఇంత దారుణంగా కొట్టాడా లేక మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..