పెళ్లి రోజు రాత్రి గదిలోకి ప్రవేశించిన వరుడు.. భార్యను చూసి షాక్.. రీజన్ ఏమిటంటే

బిజ్నోర్ జిల్లాలో తనకు నాలుగేళ్ల క్రితం వివాహమైందని బాధితుడు పోలీసులకు చెప్పాడు. పెళ్లిరోజు రాత్రి తొలిసారి తాను..  భార్య వద్దకు వెళ్లగా.. తన భార్య అమ్మాయి కాదని ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది. ఈ విషయమై భార్యను ఆరా తీసిన భర్తను.. అతని భార్య, అత్తమామలు కలిసి బెదిరించి తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపుతామని బెదిరించారు. దీంతో భర్త భయపడ్డాడు..భార్య తన తల్లిదండ్రులతో కలిసి బెదిరించి నాలుగేళ్లుగా డబ్బు వసూలు చేస్తూనే ఉన్నారు. 

పెళ్లి రోజు రాత్రి గదిలోకి ప్రవేశించిన వరుడు.. భార్యను చూసి షాక్.. రీజన్ ఏమిటంటే
Bride Is Transgender

Updated on: Oct 12, 2023 | 1:41 PM

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెళ్లయ్యాక ఫస్ట్ నైట్  జరుపుకునేందుకు ఓ యువకుడు సంతోషంగా ఇక్కడికి వచ్చాడు. అయితే అక్కడ తన భార్య అమ్మాయి కాదని ట్రాన్స్ జెండర్ అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పృహ కోల్పోయాడు. వెంటనే ఈ  విషయంపై ఆ యువకుడు తన భార్య, బావ, అత్తమామలను నిలదీశాడు. అలా నాలుగేళ్లు గడిపాడు.. తాజాగా అత్తవారు చేసిన మోసంపై పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. ఈ ఘటన ఠాకూర్‌ద్వారా కొత్వాలి ప్రాంతానికి చెందినది. యువకుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బిజ్నోర్ జిల్లాలో తనకు నాలుగేళ్ల క్రితం వివాహమైందని బాధితుడు పోలీసులకు చెప్పాడు. పెళ్లిరోజు రాత్రి తొలిసారి తాను..  భార్య వద్దకు వెళ్లగా.. తన భార్య అమ్మాయి కాదని ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది. ఈ విషయమై భార్యను ఆరా తీసిన భర్తను.. అతని భార్య, అత్తమామలు కలిసి బెదిరించి తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపుతామని బెదిరించారు. దీంతో భర్త భయపడ్డాడు..భార్య తన తల్లిదండ్రులతో కలిసి బెదిరించి నాలుగేళ్లుగా డబ్బు వసూలు చేస్తూనే ఉన్నారు.

వివాహ సమయంలో చాలా వైభవంగా పెళ్లి ఊరేగింపుతో బిజ్నోర్‌కు వెళ్లినట్లు బాధితుడు చెప్పాడు. అయితే రాత్రి మొదటి రాత్రి జరుపుకునేందుకు వెళ్లగా.. భార్య నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. అతని భార్య ట్రాన్స్‌జెండర్. ఆ సమయంలో తాను చికిత్స పొందుతున్నానని, త్వరలోనే స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందుతాయని భార్య చెప్పింది. నాలుగేళ్లు ఎదురు చూసిన యువకుడు తనకు ఈ భార్య వద్దని వదిలేస్తానని చెప్పడంతో అతని భార్య, అత్తమామలు నేరుగా బెదిరించారు

ఇవి కూడా చదవండి

దీంతో నాలుగుఏళ్లు అతి కష్టంగా మౌనంగా ఉన్నాడు. తన భార్య జననాంగాలు అభివృద్ధి చెందడానికి ఎదురుచూడటం ప్రారంభించాడు. ఇంతలో భార్య, అత్తమామలు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే తన అసభ్యకర వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. అంతేకాదు చాలాసార్లు అత్తవారు భర్త  ఇంటికి వచ్చి కొట్టారు. రోజూ ఇలా హింసించడంతో విసిగిపోయిన బాధితుడు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 323, 384, 420, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..