AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమానుషం.. నిద్రలో ఉన్న బాలుడిపై నరరూప రాక్షసం.. కిడ్నాప్ చేసి మర్మాంగాలు కోసేసిన దుర్మార్గుడు!

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా దిదౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని కుదిపేసే ఘటన వెలుగులోకి వచ్చింది. నార్తో గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఒక దళిత బాలుడిని అపహరించి, అడవిలోకి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా హింసించినట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో బాలుడి మర్మాంగాలు, ముక్కు కోసినట్లు ఆరోపణలు ఉండటంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

అమానుషం.. నిద్రలో ఉన్న బాలుడిపై నరరూప రాక్షసం.. కిడ్నాప్ చేసి మర్మాంగాలు కోసేసిన దుర్మార్గుడు!
Amroha Crime
Balaraju Goud
|

Updated on: Jul 04, 2026 | 1:57 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా దిదౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని కుదిపేసే ఘటన వెలుగులోకి వచ్చింది. నార్తో గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఒక దళిత బాలుడిని అపహరించి, అడవిలోకి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా హింసించినట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో బాలుడి మర్మాంగాలు, ముక్కు కోసినట్లు ఆరోపణలు ఉండటంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

పోలీసుల సమాచారం ప్రకారం, శుక్రవారం (జూలై 03) ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కమల్‌జీత్ అనే బాలుడు తన తల్లి అశా పక్కన నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అతడిని అపహరించినట్లు అనుమానిస్తున్నారు. కొద్దిసేపటికి బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. అనంతరం గ్రామ సమీపంలోని నిర్మానుష్య అడవిలో రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బాలుడు కనిపించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల ప్రకారం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా సంభాల్ జిల్లాకు చెందిన షాన్‌ను పోలీసులు గుర్తించారు. అతను మాదకద్రవ్యాలకు బానిసగా ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వర్గాల ప్రకారం, నిందితుడు, బాధిత కుటుంబం మధ్య గతంలోనూ వివాదాలు ఉన్నాయని సమాచారం. పోలీసుల రికార్డుల ప్రకారం, 2026 ఫిబ్రవరిలో బాలుడి తల్లి షాన్‌పై అత్యాచారం, దాడి, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసులో తరువాత ఆమె స్వయంగా నిందితుడికి బెయిల్ ఇప్పించినట్లు విచారణలో బయటపడింది. బెయిల్ తర్వాత నిందితుడు తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడని స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై స్పందించిన అమ్రోహా అదనపు ఎస్పీ అఖిలేష్ భదౌరియా మాట్లాడుతూ, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి దిదౌలి పోలీసులు, స్వాట్ బృందం నిందితుడు షాన్‌ను గుర్తించగా, అతను తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సమయంలో అతని కాలికి బుల్లెట్ గాయం కాగా, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం అతడిని కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తల్లి పాత్రపై స్థానికంగా చర్చలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణకు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్