జైలు నుంచి రాగానే జేజేలు.. అత్యాచార నిందితుడికి పూలదండలతో ఘన స్వాగతం!

అత్యాచారం వంటి ఘోరమైన నేరానికి పాల్పడి, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఒక నిందితుడికి పూలదండలతో సమాజం స్వాగతం పలకడం అత్యంత విచారకరం, శోచనీయం. ఈ దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

జైలు నుంచి రాగానే జేజేలు.. అత్యాచార నిందితుడికి పూలదండలతో ఘన స్వాగతం!
Sushil Prajapati

Updated on: May 20, 2026 | 7:50 AM

అత్యాచారం వంటి ఘోరమైన నేరానికి పాల్పడి, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఒక నిందితుడికి పూలదండలతో సమాజం స్వాగతం పలకడం అత్యంత విచారకరం, శోచనీయం. ఈ దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

హిందూ యువ వాహిని మాజీ సభ్యుడైన సుశీల్ ప్రజాపతి అనే వ్యక్తి, ఒక లా విద్యార్థినికి న్యాయవాదిని పరిచయం చేస్తానని నమ్మించి, తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుశీల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దాదాపు 9 నెలల పాటు జైలులో ఉన్న నిందితుడికి ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మే నెల 17వ తేదీన సుశీల్ ప్రజాపతి జైలు గేటు దాటి బయటకు రాగానే, అతని అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నేరం రుజువై నిర్దోషిగా బయటకు వచ్చినట్టు, అతని మెడలో పూలదండలు వేసి, కరచాలనం చేస్తూ, కాళ్లకు మొక్కుతూ నానా హడావిడి చేశారు. అంతటితో ఆగకుండా, నిందితుడిని భుజాలపై మోస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఒక మహిళపై అమానుషానికి ఒడిగట్టిన వ్యక్తికి ఇలాంటి వీరస్వాగతం లభించడంపై సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది బాధితురాలిని మరింత మానసిక క్షోభకు గురిచేయడమేనని మండిపడుతున్నారు. ఈ ఘోరమైన ఊరేగింపు వీడియోలు వైరల్ కావడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, నిందితుడిని కీర్తించడం వంటి అంశాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us