అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాక్.. H-1B వీసా లాటరీ విధానం రద్దు!

ఇక లాటరీతో వీసా దక్కే రోజులకు అమెరికా ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పటివరకు అదృష్టం ఉంటే చాలు.. పేరు లాటరీలో పడితే అమెరికా గేట్లు తెరుచుకునేవి. కానీ ఇకపై ఆ సీన్ లేదు. తెలివితేటలు, హై సాలరీ ఉన్నవారికే వీసా అనే కొత్త పాలసీకి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు H-1B వీసాల కోసం..

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాక్.. H-1B వీసా లాటరీ విధానం రద్దు!
H-1B visa lottery scrapped

Edited By:

Updated on: Dec 24, 2025 | 9:55 PM

హైదరాబాద్, డిసెంబర్‌ 24: ఇక లాటరీతో వీసా దక్కే రోజులకు అమెరికా ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పటివరకు అదృష్టం ఉంటే చాలు.. పేరు లాటరీలో పడితే అమెరికా గేట్లు తెరుచుకునేవి. కానీ ఇకపై ఆ సీన్ లేదు. తెలివితేటలు, హై సాలరీ ఉన్నవారికే వీసా అనే కొత్త పాలసీకి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు H-1B వీసాల కోసం లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చేవి. వాటన్నింటినీ కంప్యూటర్‌లో వేసి లాటరీ తీసేవారు. ఎవరి పేరు వస్తే వారికి వీసా ఇచ్చేవారు. అయితే జీతం ఎంత? స్కిల్స్ ఎంత? అన్నది పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో తక్కువ నైపుణ్యం ఉన్నవారికి కూడా వీసా వచ్చేస్తుండగా.. టాప్ టాలెంట్‌కు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయానికి అమెరికా వచ్చింది.

ఇకపై లాటరీ కాదు.. జీతమే ప్రమాణం. ఒకే వీసాకు నలుగురు అప్లై చేస్తే.. ఎవరికైతే కంపెనీ ఎక్కువ జీతం ఆఫర్ చేస్తుందో వారికే ముందుగా వీసా. తక్కువ ప్యాకేజ్ ఉన్నవారికి అవకాశం దాదాపు శూన్యం. అంటే టాప్ లెవల్ స్కిల్స్ ఫ్లస్ హై సాలరీ ఉంటేనే అమెరికా డ్రీమ్ నెరవేరుతుంది. ఇది అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమేనని ఆ దేశం స్పష్టం చేస్తోంది. ఇది భారత ఐటీ ఉద్యోగులకు ఎంతో ఇబ్బందికరం. భారత్ నుంచి ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు కంపారేటివ్‌గా తక్కువ జీతాలతోనే అమెరికా వెళ్తుంటారు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే.. అలాంటి వారికి వీసా రావడం చాలా కష్టం. కంపెనీలు కూడా భారతీయులను పిలిపించుకోవాలంటే తప్పనిసరిగా భారీ ప్యాకేజీలు ఆఫర్ చేయాల్సిందే.

అంతేకాదు.. ఒక్కో వీసాకు ప్రభుత్వ ఫీజు సుమారు 84 లక్షల రూపాయలు ఉండటంతో సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అమెరికా కల మరింత దూరమవుతోంది. ఇంతవరకు కొన్ని కంపెనీలు ఒకే వ్యక్తి పేరుతో అనేక అప్లికేషన్లు వేసి లాటరీలో గెలిచేలా అక్రమాలకు పాల్పడేవి. కానీ కొత్త వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ వల్ల అలాంటి మోసాలకు పూర్తిగా చెక్ పడనుంది. ఇకపై ప్రతిభ ఉన్నవారికే ప్రాధాన్యం.ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు కూడా తమ రిక్రూట్‌మెంట్, ఆన్‌సైట్ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.