అమెరికా ఎన్నికల ఫలితాలపై తమిళనాడులో టెన్షన్‌

|

Nov 04, 2020 | 12:28 PM

అమెరికా ఎన్నికలపై అక్కడివారి కంటే తమిళనాడు ప్రజలే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు.. అమెరికా పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు తమిళనాడులో మెజారిటీ ప్రజలు న్యూస్‌ ఛానెల్స్‌ను ఫాలో అవుతూ వచ్చారు..

అమెరికా ఎన్నికల ఫలితాలపై తమిళనాడులో టెన్షన్‌
Follow us on

అమెరికా ఎన్నికలపై అక్కడివారి కంటే తమిళనాడు ప్రజలే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు.. అమెరికా పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు తమిళనాడులో మెజారిటీ ప్రజలు న్యూస్‌ ఛానెల్స్‌ను ఫాలో అవుతూ వచ్చారు.. ఇప్పుడు కౌంటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో వారిలో ఉత్కంఠ అమాంతం పెరిగింది.. ఇందుకు కారణం డెమొక్రటిక్‌ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నది కమలా హారిస్‌ కాబట్టి.. ఆమె పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు కాబట్టి. మొన్న కమలాహారిస్‌ విజయం సాధించాలంటూ ఆలయాలలో పూజలు చేశారు.. ఇష్టదైవాలకు మొక్కుకున్నారు. ఇప్పుడూ తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక కమలాహారిస్‌ తల్లి సొంత గ్రామమైన తులసేంద్రపురంలో అయితే ప్రజలు టెలివిజన్‌ ముందు నుంచి లేవడం లేదు.. కమలా తమకు ఆదర్శమని, ఆమె బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తామని ఓ యువతి గర్వంగా చెప్పుకున్నారు.