
Youngest UPSC Toppers: దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ సివివిల్స్ ఎగ్జామ్ ఒకటి. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలో విజయం సాధించడం దాదాపు అసాధ్యమనే అంటుంటారు. అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా.. టాపర్స్‌గా నిలిచిన ఐఏఎస్ అధికారులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మనం యూపీఎస్సీలో టాపర్‌గా నిలిచిన ఐదుగురు యువ ఐఏఎస్ అధికారుల గురించి తెలుసుకుందాం.
1. అనన్య సింగ్: ప్రయాగ్‌రాజ్ నివాసి అయిన 22 ఏళ్ల అనన్య సింగ్ తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పక్కా ప్రణాళిక ప్రకారం సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యానని చెప్పారు. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే ఆలిండియాలో 51వ ర్యాంకు సాధించి ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. అనన్య సింగ్ 2019లో యూపీఎస్సీ పరీక్ష రాశారు.
2. టీనా దాబీ (IAS టీనా దాబీ): అతి చిన్న వయస్సులోనే యూపీఎస్సీ సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి యువతలో తనకంటూ చెరగ ముద్ర వేసుకున్నారు టీనా దాబి. 2015లో టీనా దాబీ UPSCలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఆమె 20 సంవత్సరాల వయస్సులోనే పట్టభద్రులయ్యారు. ఆ తరువాత 2 సంవత్సరాల ప్రిపరేషన్ తర్వాత IAS సాధించారు. చిన్నప్పటి నుంచి తనకు వార్తాపత్రికలు చదివే అలవాటు ఉందని, అది పరీక్షలో చాలా సహాయపడిందని టీనా తెలిపింది.
3. అమృతేష్ ఔరంగాబాద్కర్ (IAS అమృతేష్ ఔరంగాబాద్కర్): దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన IAS అధికారుల జాబితాలో మహారాష్ట్రలోని పూణేకు చెందిన అమృతేష్ ఔరంగాబాద్కర్ కూడా నిలిచారు. 2011లో యూపీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే 10వ ర్యాంక్ సాధించారు.
4. రోమన్ సైనీ : రాజస్థాన్‌లోని జైపూర్ నగర నివాసి రోమన్ సైనీ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన IAS అధికారిగా ఎంపికయ్యారు. 22 ఏళ్లకే ఐఏఎస్ అధికారిగా నిలిచారు. 2013లో యూపీఎస్సీ పరీక్ష రాసి ఆల్ ఇండియాలో 18వ ర్యాంక్ సాధించారు. అయితే, రోమన్ సైనీ తన IAS ఉద్యోగాన్ని వదిలి సివిల్స్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు బోధించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.
5. స్వాతి మీనా (IAS స్వాతి మీనా): రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన స్వాతి మీనా వాస్క్ 2007లో UPSC పరీక్ష రాసి ఆల్ ఇండియాలో 260 ర్యాంక్‌ను సాధించారు. మధ్యప్రదేశ్ కేడర్‌కు ఎంపికైన స్వాతి మీనా ప్రస్తుతం కీలక పోస్టులో ఉన్నారు.
Also read: