UPSC Prelims Analysis 2023: మరింత కఠినంగా సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష.. కటాఫ్‌ తగ్గే ఛాన్స్‌

|

May 29, 2023 | 1:47 PM

త కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో ప్రశ్నలు ఎక్కువగా న్యూస్‌ పేపర్ చదివే వారు మాత్రమే జవాబులు రాయగలిగే విధంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు..

UPSC Prelims Analysis 2023: మరింత కఠినంగా సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష.. కటాఫ్‌ తగ్గే ఛాన్స్‌
UPSC Prelims
Follow us on

దేశవ్యాప్తంగా ఆదివారం (మే 28) యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌; ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష జరిగింది. ఐతే గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో ప్రశ్నలు ఎక్కువగా న్యూస్‌ పేపర్ చదివే వారు మాత్రమే జవాబులు రాయగలిగే విధంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.

విభాగాల వారిగా చూస్తే.. పేపర్‌ 1 లో 100 ప్రశ్నలకు గానూ.. వర్తమాన వ్యవహారాలపై 11, ఆర్థికశాస్త్రం, సామాజికాభివృద్ధి 11, చరిత్ర-సంస్కృతి 12, రాజనీతిశాస్త్రం, పరిపాలన 17, పర్యావరణం 20, జాగ్రఫీ 15, జనరల్‌ నాలెడ్జ్‌పై 9, మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయని నిపుణులు తెలిపారు.

ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 (సీశాట్‌) కొంత సులభంగా ఉందని, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కూడా సులువుగా రాసేవిధంగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి కటాఫ్‌ మార్కులు తగ్గే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు. జూన్‌ 15 నాటికి ఈ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. సివిల్స్‌లో ఈసారి 1105 ఖాళీలు భర్తీ చేయనున్నారు. కాగా ప్రతీయేట సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడుతున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.