UPSC చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. పదవీకాలం పూర్తికాకముందే.. ఎందుకంటే..?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. పదవీకాలం పూర్తికాక ముందే రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. వ్యక్తిగత కారణాలతో సోనీ రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన రాజీనామా ఆమోదంపై అధికారిక వెలువడాల్సి ఉంది.

UPSC చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. పదవీకాలం పూర్తికాకముందే.. ఎందుకంటే..?
Upse Chairperson Manoj Soni
Follow us

|

Updated on: Jul 20, 2024 | 9:37 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. పదవీకాలం పూర్తికాక ముందే రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. వ్యక్తిగత కారణాలతో సోనీ రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన రాజీనామా ఆమోదంపై అధికారిక వెలువడాల్సి ఉంది.

మనోజ్ సోనీ పదవీకాలం 2029లో ముగియాల్సి ఉండగా, అంతకు ముందే ఆయన రాజీనామా చేశారు. సోనీ 2017లో UPSCలో సభ్యులుగా చేరారు. 16 మే 2023న, అతను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యాయి. ఇకపై మనోజ్ సోనీ గుజరాత్‌లోని స్వామినారాయణ శాఖకు చెందిన అనుపమ్ మిషన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు సమాచారం.

2020లో దీక్షను స్వీకరించిన తర్వాత, అతను అనుపమ్ మిషన్‌లో సాధు కర్మయోగి అయ్యారు. మనోజ్ సోనీ రాజీనామా అంశం ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు సంబంధించినది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడుసార్లు వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన డాక్టర్ సోనీ, అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 2005లో దేశంలోనే అతి పిన్న వయస్కుడైన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..