Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలిటిక్స్‌లో క్రిమినల్స్ .. పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశం

రాజకీయాల్లో క్రిమినల్ నేతలకు కాలం చెల్లేట్టు కనబడుతోంది. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలిటిక్స్ కి శుభారంభం పలికే కాలం రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గురువారం ఇఛ్చిన కీలకమైన తీర్పే ! అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను తమతమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని  కోర్టు ఆదేశించింది. పాలిటిక్స్ లో  క్రిమినలైజేషన్ పెరిగిపోతోందని, 2018 సెప్టెంబరులో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని […]

పాలిటిక్స్‌లో క్రిమినల్స్ .. పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 13, 2020 | 12:27 PM

రాజకీయాల్లో క్రిమినల్ నేతలకు కాలం చెల్లేట్టు కనబడుతోంది. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలిటిక్స్ కి శుభారంభం పలికే కాలం రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గురువారం ఇఛ్చిన కీలకమైన తీర్పే ! అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను తమతమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని  కోర్టు ఆదేశించింది. పాలిటిక్స్ లో  క్రిమినలైజేషన్ పెరిగిపోతోందని, 2018 సెప్టెంబరులో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని అత్యున్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. రాజకీయ నాయకుల క్రిమినల్ రికార్డులను ఆయా పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలని కోర్టు ఆ నాడు ఆదేశించింది. అయితే ఏ పార్టీ కూడా ఈ ఆదేశాలను పాటించడంలేదని పిటిషనర్ పేర్కొన్నారు. గత నాలుగు జనరల్ ఎన్నికల్లోనూ నేరగ్రస్త రాజకీయాలు పెరుగుతూ వచ్చాయని పేర్కొన్న న్యాయస్థానం.. అభ్యర్థులకు సంబంధించి పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో తాము ఇఛ్చిన ఆదేశాలను పార్టీలు పాటించని పక్షంలో ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ తమ దృష్టికి తేవాలని కూడా సూచించింది.

(జస్టిస్ ఆర్.ఎస్.నారిమన్ ఆధ్వర్యాన గల బెంచ్.. గత జనవరి 31 న జారీ చేసిన ఆదేశాలను రిజర్వ్ లో ఉంచింది). తాము ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో ఎవరిపై అయినా నేర సంబంధ కేసులు ఉన్న పక్షంలో.. వాటి వివరాలను తమ వెబ్ సైట్లలో పొందుపరచడమే గాక.. అలాంటివారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో వివరించాలని కూడా బెంచ్ ఆదేశించింది. అలాగే ఈ అంశాలను ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సాధనాల్లోనూ, వార్తా పత్రికల్లోనూ ప్రచురించాలని న్యాయమూర్తులు సూచించారు.

ఈ వివరాలను తెలియజేయని పార్టీలు శిక్షార్హమైనవని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ముందు అభ్యర్థులంతా తమ కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో ప్రస్తావించాలని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2018 సెప్టెంబరులో తీర్పునిచ్చింది. సీరియస్ క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు పార్లమెంటులో ప్రవేశించకుండా చట్టం చేసే బాధ్యత ఆ సభదేననికూడా స్పష్టం చేసింది.